మీడియా కెమెరాల సాక్షిగా లైవ్‌లో ఎన్‌కౌంటర్
ఉత్తరప్రదేశ్ పోలీసులు లైవ్ ప్రసారాల న్యూస్ లో ఎన్‌కౌంటర్ చేశారు. మీడియాను పిలిపించి మరీ .. కెమెరాల సాక్షిగా ఎన్‌కౌంటర్ చేసి చూపించారు. ఇద్దరు హంతకులను మట్టుబెట్టారు. యూపీలోని అలీఘట్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. యూపీలో దంపతులు, ఇద్దరు రైతులు, ఇద్దరు పూజారులను హత్య చేసిన ముస్తకిమ్, నౌషద్‌లను ఇలా ఎన్‌కౌంటర్ చేశారు. ఇద్దరు హంతకులు బైకుపై వెళ్తుండగా స్థానిక ఎస్‌ఐ వారిని అడ్డుకున్నారు. దీంతో వారు కాల్పులు జరుపుతూ పారిపోయి స్థానికంగా ఉన్న నీటిపారుదల శాఖకు […]
ఉత్తరప్రదేశ్ పోలీసులు లైవ్ ప్రసారాల న్యూస్ లో ఎన్‌కౌంటర్ చేశారు. మీడియాను పిలిపించి మరీ .. కెమెరాల సాక్షిగా ఎన్‌కౌంటర్ చేసి చూపించారు. ఇద్దరు హంతకులను మట్టుబెట్టారు. యూపీలోని అలీఘట్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. యూపీలో దంపతులు, ఇద్దరు రైతులు, ఇద్దరు పూజారులను హత్య చేసిన ముస్తకిమ్, నౌషద్‌లను ఇలా ఎన్‌కౌంటర్ చేశారు.
ఇద్దరు హంతకులు బైకుపై వెళ్తుండగా స్థానిక ఎస్‌ఐ వారిని అడ్డుకున్నారు. దీంతో వారు కాల్పులు జరుపుతూ పారిపోయి స్థానికంగా ఉన్న నీటిపారుదల శాఖకు చెందిన పాత భవనంలో దాక్కున్నారు. విషయం తెలిసిన అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. భవనాన్ని చుట్టుముట్టాయి. తాము ఇద్దరు హంతకులను పట్టుకోబోతున్నామని… వచ్చి కవర్ చేయాల్సిందిగా మీడియాకు పోలీసులు సమాచారం అందించారు. దీంతో మీడియా చానళ్లు కెమెరాలతో వాలిపోయాయి.
చాలా సేపు హంతకులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. చివరకు హంతకుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. పాత భవనంలోకి వెళ్లి చూడగా ఇద్దరు హంతకులు నిర్జీవంగా పడిపోయి ఉన్నారు. ఎన్‌కౌంటర్లో ఒక పోలీసు కూడా గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ పారదర్శకంగా జరిగిందని చూపించేందుకే తాము మీడియాను ఆహ్వానించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.