గులాబీ జాబితాలో 20 మందిని మారుస్తారట !
గులాబీ జాబితాలో మార్పులు ఉంటాయని ప్రచారం మొదలైంది. కనీసం 20 మందిని మారుస్తారని టాక్ విన్పిస్తోంది. కేసీఆర్ 105 మందితో జంబోలిస్ట్ ప్రకటించిన తర్వాత… కొందరు బహిరంగంగానే ఈ అభ్యర్ధులను విమర్శిస్తున్నారు. దానికి తోడు ఇపుడు ప్రకటించిన వారిలో చాలా మందిపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది. కొన్ని చోట్ల కొందరు అభ్యర్థులు గెలిచే అవకాశమే లేదంటున్నారు. అయితే మార్పుల్లేవ్.. చేర్పుల్లేవ్ అని కరాఖండిగా చెప్పిన టీఆర్‌ఎస్ నేతలు.. ఇపుడు లిస్ట్‌లో ట్విస్ట్‌లు ఉన్నాయని చెబుతున్నారు. మార్పులుంటాయని […]
గులాబీ జాబితాలో మార్పులు ఉంటాయని ప్రచారం మొదలైంది. కనీసం 20 మందిని మారుస్తారని టాక్ విన్పిస్తోంది. కేసీఆర్ 105 మందితో జంబోలిస్ట్ ప్రకటించిన తర్వాత… కొందరు బహిరంగంగానే ఈ అభ్యర్ధులను విమర్శిస్తున్నారు. దానికి తోడు ఇపుడు ప్రకటించిన వారిలో చాలా మందిపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది. కొన్ని చోట్ల కొందరు అభ్యర్థులు గెలిచే అవకాశమే లేదంటున్నారు. అయితే మార్పుల్లేవ్.. చేర్పుల్లేవ్ అని కరాఖండిగా చెప్పిన టీఆర్‌ఎస్ నేతలు.. ఇపుడు లిస్ట్‌లో ట్విస్ట్‌లు ఉన్నాయని చెబుతున్నారు. మార్పులుంటాయని చెబుతున్నారు. దీనికి అసంతృప్తులను చల్లబరించేందుకు కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడాన్ని కారణంగా చూపిస్తున్నారు. ఇపుడున్న 105 మందిలో ఇరవై మంది పేర్లు మార్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ”ఇపుడు ప్రకటించిన అభ్యర్థుల మీద సీఎం నిఘా పెట్టారు. ఇంటెలిజెన్స్‌తో పాటు ప్రైవేట్ ఏజెన్సీలు అన్ని వివరాలు రాబడుతున్నాయి. మార్పులు చేస్తే చేయొచ్చు.
రాజయ్య కూడా కొన్ని తప్పులు చేశారు. ఇక్కడ కడియం శ్రీహరి, రాజారపు ప్రతాప్‌లు కూడా ఉన్నారు. రాజారపు ప్రతాప్ కి కూడా టిక్కెట్ వస్తే రావొచ్చు”.. అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్టేషన్ ఘన్‌పూర్‌లో చెప్పిన మాటలు… ఇపుడు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఈ విషయం చెప్పిన తర్వాత ఆయన ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలవడం ఈ అనుమానాలకు మరింత బలం తీసుకొచ్చింది.
అంతేకాదు.. ప్రతి అభ్యర్థి మీద నిఘా ఉందన్న విషయం కూడా స్పష్టమవుతోంది. ఈ రిపోర్ట్‌లు ఎప్పటికప్పుడు కేసీఆర్‌కు చేరుతున్నాయని.. అంటున్నారు. అంతేకాదు చివరి నిమిషంలో బీఫామ్‌లు నిరాకరిస్తే… మరో పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటుందని… ఇక్కడే ఎమ్మెల్సీయో, కార్పొరేషన్ పదవి ఇస్తానంటూ బుజ్జగిస్తే.. కొందరు నేతలు సైలెంట్ అయిపోతారని, అందుకే కేసీఆర్ ఇలా ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. చూశారుగా కేసీఆర్ ఆశపెట్టి.. ప్రకటించి.. లాస్ట్ మినిట్‌లో హ్యాండిస్తారన్న మాట..