పురందేశ్వరి విజయ రహస్యం ఏంటి?
ఎన్టీఆర్ కుమార్తె అన్న పేరో, లేక ఆమె ప్రతిభో కాని పురందేశ్వరికి ఏ పార్టీలోకి వెళ్లినా ఈజీగా పదవులు దొరికేస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ లో చేరిన పురందేశ్వరి ఏకంగా కేంద్రమంత్రి అయి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ఆఖరి వరకు మంత్రి పదవిలో కొనసాగి తీరా ఎన్నికల సమయంలో బీజేపీలోకి జంప్ అయ్యారు. పదవీకాలాన్ని పూర్తిగా అనుభవించి ఆఖరిలో హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కంగుతిన్నారు. బీజేపీలో చేరిన వెంటనే ఆమె మహిళా […]
ఎన్టీఆర్ కుమార్తె అన్న పేరో, లేక ఆమె ప్రతిభో కాని పురందేశ్వరికి ఏ పార్టీలోకి వెళ్లినా ఈజీగా పదవులు దొరికేస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ లో చేరిన పురందేశ్వరి ఏకంగా కేంద్రమంత్రి అయి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ఆఖరి వరకు మంత్రి పదవిలో కొనసాగి తీరా ఎన్నికల సమయంలో బీజేపీలోకి జంప్ అయ్యారు.
పదవీకాలాన్ని పూర్తిగా అనుభవించి ఆఖరిలో హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కంగుతిన్నారు. బీజేపీలో చేరిన వెంటనే ఆమె మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పదవి సాధించారు. ఇప్పుడు ఆమె వైసీపీలో చేరుతారు.. మరో పార్టీలోకి వెళ్తారు అన్న ప్రచారం జరుగుతుండగానే మరో పదవి దక్కింది.
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా పురందేశ్వరి నియమితులయ్యారు. కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యారు. ఆమె మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. పురందేశ్వరికి పదవి దక్కడంపై చర్చ జరుగుతోంది. పార్టీలు మారుతున్నా ఆమెకు పదవులు దక్కడం మాత్రం ఆగడం లేదని..ఆ విజయ రహస్యం ఏమిటని పలువురు నేతలు జుట్టు పీక్కుంటున్నారు.