ఆహారంలో " ఖనిజ లవణాలు
ఆహారంలో – ఖనిజ లవణాలు ఖనిజ లవణాలు: ఇవి దాదాపు అన్ని ఆహారపదార్థాలలోనూ లభిస్తాయి. స్థూల పోషక పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలుగానూ విభజించవచ్చు. వీటి లోటు వల్ల కొన్ని అనారోగ్యాలు వస్తాయి. మోతాదును మించి వాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. సూక్ష్మ పోషక పదార్థాలు రాగి ఇది ప్లాస్మాలోనూ, లీవర్‌లోనూ, హెమో గ్లోబిన్‌లోనూ ఉంటుంది. దీని లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. అంచేత పిల్లలు మగతగా ఉంటారు. ప్రాణవాయువును కణజాలానికి అందించే కార్యక్రమంలో […]
ఆహారంలో – ఖనిజ లవణాలు
ఖనిజ లవణాలు: ఇవి దాదాపు అన్ని ఆహారపదార్థాలలోనూ లభిస్తాయి. స్థూల పోషక పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలుగానూ విభజించవచ్చు. వీటి లోటు వల్ల కొన్ని అనారోగ్యాలు వస్తాయి. మోతాదును మించి వాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి.
సూక్ష్మ పోషక పదార్థాలు
రాగి
ఇది ప్లాస్మాలోనూ, లీవర్‌లోనూ, హెమో గ్లోబిన్‌లోనూ ఉంటుంది. దీని లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. అంచేత పిల్లలు మగతగా ఉంటారు. ప్రాణవాయువును కణజాలానికి అందించే కార్యక్రమంలో పాల్గొంటుంది.
అయోడీన్
అయోడీన్ లోపం వల్ల తైరాయిడ్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. గిరిజన ప్రాంతాలలో అధిక వర్షపాతం కారణంగా భూమిలో ఉండవలసిన అయోడీన్ ఉండదు. అంచేత అక్కడ పండిన అన్ని పంటలలోనూ అయోడీన్ తగినంత ఉండదు. అంచేతనే గిరిజనులలో ఎక్కువగా గాయిటర్ కనిపిస్తుంది. అయోడైజ్డ్ ఉప్పు వాడడం మంచిది.
జింకు
ఇన్సులిన్‌లో జింకు ధాతువు ఉంటుంది. దీని లోపం వల్ల పేను కొరుకుడు (ఆలోపీసియా) రావచ్చు. దీని పరిపూర్ణ స్వభావం పూర్తిగా తెలియదు. కాని లీవర్‌లోనూ, చిరుధాన్యంలోనూ (పాలిష్ చెయ్యనివి), నట్స్‌లోనూ, పప్పు దినుసులలోనూ లభిస్తుంది. జల్లించని గోధుమ పిండిలో కూడా లభిస్తుంది.
ఇవిగాక మాంగనీసు, కోబాల్టు, మాలిబ్డినమ్, ఫ్లోరిన్, సెలీనియం, నికిల్, క్రోమియం, కాడ్మియం, వానాడియం, సిలికాన్, స్ట్రోంటియం వంటి ఖనిజ లవణాలు కూడా అవసరమే కాని వైవిధ్యం గల ఆహారం, కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, చిరు ధాన్యాలు, పాలు వగైరాలు పద్ధతి ప్రకారం ఆహారంలో ఉంటే ఈ లోటు రాదు. చేపలు, చికెన్, మాంసము తినేవారిలో సాధారణంగా సూక్ష్మపోషక ఖనిజ లవణాల లోటు రాకపోవచ్చు.