బుద్ధా వెంకన్నను అంతా ఆదర్శంగా తీసుకోవాలి....

తనపై ప్రతిపక్షాల నాయకులు విమర్శలతో విరుచుకుపడుతుంటే…. తమ వాళ్లు మాత్రం ధాటిగా సమాధానాలు ఇవ్వడం లేదని ఫీలవుతున్నాడట చంద్రబాబు నాయుడు. తన పార్టీ మీటింగులో నేతల వద్ధ ఈ విషయంలోనే చంద్రబాబు నాయుడు వాపోయాడట. ప్రతిపక్షాలు తనపై నిప్పులు చెరుగుతున్నాయని.. అయితే తెలుగుదేశం నుంచి ఆ విమర్శలకు సరైన సమాధానాలు లేవని బాబు అన్నారట. ఈ విషయంలో తన అసహనాన్ని తన పార్టీ వారి వద్దే చాటాడట చంద్రబాబు నాయుడు. ఇక్కడ మరో ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. […]

Advertisement
Update:2018-09-21 01:56 IST

తనపై ప్రతిపక్షాల నాయకులు విమర్శలతో విరుచుకుపడుతుంటే…. తమ వాళ్లు మాత్రం ధాటిగా సమాధానాలు ఇవ్వడం లేదని ఫీలవుతున్నాడట చంద్రబాబు నాయుడు. తన పార్టీ మీటింగులో నేతల వద్ధ ఈ విషయంలోనే చంద్రబాబు నాయుడు వాపోయాడట.

ప్రతిపక్షాలు తనపై నిప్పులు చెరుగుతున్నాయని.. అయితే తెలుగుదేశం నుంచి ఆ విమర్శలకు సరైన సమాధానాలు లేవని బాబు అన్నారట. ఈ విషయంలో తన అసహనాన్ని తన పార్టీ వారి వద్దే చాటాడట చంద్రబాబు నాయుడు. ఇక్కడ మరో ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. ప్రత్యర్థులపై విరుచుకుపడాలని తమ వారికి ఆదేశాలిచ్చిన చంద్రబాబు నాయుడు, ఈ విషయంలో అంతా బుద్ధా వెంకన్నను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పుకొచ్చాడట.

తనపై విమర్శలు చేసే వారిపైకి అందరూ బుద్ధా వెంకన్నలా విరుచుకుపడాలని చంద్రబాబు సూచించాడట. బుద్ధా వెంకన్న ఎలా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే. అడ్డగోలుగా మాట్లాడటంలో, అర్థం లేకుండా మాట్లాడటంలో ఎక్స్ పర్ట్ ఈ ఎమ్మెల్సీ. ఈయనపై చాలా రకాల ఆరోపణలున్నాయి. కాల్ మనీ సెక్స్ రాకేట్ వ్యవహారంలో కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

ఇక వైసీపీ నేతలపై ఈయన అర్థం లేని ఆరోపణలే చేస్తూ ఉంటాడు. వాటిల్లో ఏదీ పస ఉండదు. ఇలాంటి బుద్ధా వెంకన్నను అంతా ఆదర్శంగా తీసుకోవాలని తన పార్టీ వారికి చంద్రబాబు నాయుడు సూచించాడట. అయినా చంద్రబాబు నాయుడు రోజూ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నాడు, దాన్ని అనుకూల పత్రికలు హైలెట్ చేస్తూనే ఉన్నాయి…. ఇక బాబు గురించి మాట్లాడడానికి ఏం ఉందని వాపోతున్నారట కొందరు టీడీపీ నాయకులు.

Tags:    
Advertisement

Similar News