మేకపాటికి ఢోకా లేన్నట్టే..

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడాన్ని మేకపాటి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలోకి వస్తే ఆత్మకూరు టికెట్ ఇస్తారని ప్రచారం జరగడం కూడా అందుకు కారణం. రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిక కార్యక్రమానికి కూడా మేకపాటి వర్గం దూరంగా నిలిచింది. అయితే టికెట్ల అంశంపై వైసీపీ ఒక స్పష్టత ఇచ్చేసింది. ఆనం రామనారాయణరెడ్డిని వెంకటగిరి ఇన్‌చార్జ్‌గా జగన్‌ నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. దీంతో మేకపాటి […]

Advertisement
Update:2018-09-21 04:37 IST

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడాన్ని మేకపాటి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలోకి వస్తే ఆత్మకూరు టికెట్ ఇస్తారని ప్రచారం జరగడం కూడా అందుకు కారణం. రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిక కార్యక్రమానికి కూడా మేకపాటి వర్గం దూరంగా నిలిచింది. అయితే టికెట్ల అంశంపై వైసీపీ ఒక స్పష్టత ఇచ్చేసింది.

ఆనం రామనారాయణరెడ్డిని వెంకటగిరి ఇన్‌చార్జ్‌గా జగన్‌ నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. దీంతో మేకపాటి కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో కోత తప్పదు అన్న ప్రచారం ఉత్తిదే అని తేలిపోయింది. 2014 తరహాలోనే రాజమోహన్ రెడ్డి ఎంపీగా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి, మేకపాటి గౌతమ్ ఆత్మకూరు నుంచి పోటీ చేయడం ఖాయమైంది.

ఆనంకు వెంకటగిరి బాధ్యతలు అప్పగించడంతో ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌గా ఉన్న బొమ్మిరెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్న దానిపై చర్చ జరుగుతోంది. అయితే బొమ్మిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ ప్రయోజానాల దృష్ట్యా ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి బాధ్యతలు అప్పగించడం సరైన చర్యేనని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News