కుస్తీమే సవాల్ అంటున్న కవితాదేవి
డబ్ల్యు డబ్ల్యు ఈ కుస్తీలో భారత సంచలనం హర్యానా నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన వస్తాదు 35 ఏళ్ల వయసులో కుస్తీమే సవాల్ అంటున్న కవితాదేవి అమెరికా వేదికగా వచ్చే నెలలో జరిగే… వరల్డ్ రెస్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ బరిలోకి భారత మహిళా వస్తాదు కవితా దేవి దిగనుంది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా వస్తాదుగా చరిత్ర సృష్టించనుంది. హర్యానా నుంచి ప్రపంచ స్థాయికి…. వస్తాదులు, కబడ్డీ క్రీడాకారులకు చిరునామాగా నిలిచే హర్యానాలోని మారుమూల […]
- డబ్ల్యు డబ్ల్యు ఈ కుస్తీలో భారత సంచలనం
- హర్యానా నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన వస్తాదు
- 35 ఏళ్ల వయసులో కుస్తీమే సవాల్ అంటున్న కవితాదేవి
అమెరికా వేదికగా వచ్చే నెలలో జరిగే… వరల్డ్ రెస్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ బరిలోకి భారత మహిళా వస్తాదు కవితా దేవి దిగనుంది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా వస్తాదుగా చరిత్ర సృష్టించనుంది.
హర్యానా నుంచి ప్రపంచ స్థాయికి….
సాంప్రదాయాలు, కట్టుబాట్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే హర్యానా సమాజం నుంచి వచ్చిన కవితాదేవికి ఏడేళ్ల కుమారుడు సైతం ఉన్నాడు. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో…. మూడుపదుల వయసులోనూ క్రీడారంగంలో తన ప్రస్థానం కొనసాగిస్తూ…. WWE యంగ్ క్లాసిక్ బరిలోకి కవితాదేవి అడుగుపెట్టింది. సల్వార్ కమీజ్ ధరించి… కుస్తీమే సవాల్ అంటూ ప్రత్యర్థులను ఎత్తి కుదేసింది.
ఖలీ శిక్షణ లో…..
WWE కుస్తీలో భారత తొలివస్తాదు ద గ్రేట్ ఖలీ కమ్ దలీప్ సింగ్ రాణా వద్ద… కవితా దేవి శిక్షణ తీసుకొంది. WWE వస్తాదుగా తనను తాను తీర్చిదిద్దుకోడానికి… కవితాదేవి గంటలతరబడి జిమ్ లో సాధన చేసింది.
భారత్ లో మహిళలు అంటే సుకుమారంగా ఉండే గృహిణులు మాత్రమే కాదు…. 35 ఏళ్ల వయసులో ఓ వైపు కుటుంబబాధ్యతలు నిర్వర్తిస్తూనే… కుస్తీలు పట్టే ధీరాదిధీరలు కేవలం భారత మహిళలు మాత్రమే అనటానికి..
నిలువెత్తు నిదర్శనం కవితాదేవి.