సికింద్రాబాద్‌లో 'కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్'
2026లోపు దేశమంతా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామన్న రైల్వే శాఖ మంత్రి
Advertisement
కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొన్ని పనులకు అనుమతులు కావాలన్నారు. ఢిల్లీలో మాట్లాడుతూ.. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో 1,026 కిలోమీటర్ల మేరకు ఏర్పాటు చేస్తున్నాం. 2026లోపు దేశమంతా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామన్నారు. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తాం. త్వరలో దేశమంతా సుమారు 100 నమో భారత్ ఎక్స్ ప్రెస్‌లు తీసుకురానున్నామని తెలిపారు.
Advertisement