అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆరోగ్యం విషమం
ఆదివారం పక్షవాతానికి గురైన ఆచార్య సత్యేంద్ర దాస్
Advertisement
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆదివారం పక్షవాతానికి గురయ్యారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను సంజయ్ గాంధీ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐ) లో చేర్చారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు సోమవారం తెలిపారు.
సత్యేంద్ర దాస్ బ్రెయిన్ స్ట్రోక్ బాధపడుతున్నారు. అతను డయాబెటి, హైపర్‌టెన్సివ్‌తో బాధపడుతున్నారు. అతను ఆదివారం ఎస్‌జీపీజీఐలో చేరారు. ప్రస్తుతం న్యూరాలజీ వార్డ్ (హై డిపెండెన్సీ యూనిట్)లో ఉన్నారు" అని ఎస్‌జీపీజీఐసోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.అతని పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, అతను చికిత్సకు స్పందిస్తున్నారు. అతని ఆయువుపట్లన్నీ ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. సత్యేంద్ర దాస్ డాక్టర్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది.
Advertisement