నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేపోయిన యూపీఏ, ఎన్డీఏ
'మేకిన్ ఇండియా' మంచి ఆలోచనే అయినప్పటికీ దానిని అమలు చేయడంలో మోడీ విఫలమయ్యారన్న రాహుల్
Advertisement
దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ,ఎన్డీఏ ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపెట్టలేకపోయాయని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విపలమై. దానిని చైనాకు అప్పగించామన్నారు. ఇకనైనా మనం ఉత్పత్తిపైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 'మేకిన్ ఇండియా' మంచి ఆలోచనే అయినప్పటికీ దానిని అమలు చేయడంలో మోడీ విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో మాట్లాడిన రాహుల్.. ఆ ప్రసంగంలోని అంశాలు ఏటా ఒకేలా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు.
Advertisement