ప్రేమికుడితో కూతురు.. మెయిన్ రోడ్డుపైనే నరికిన తండ్రి
హైదరాబాద్లో మరో తండ్రి కత్తిపట్టారు.. తన కూతురు మరొక యువకుడిని ప్రేమించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నడి రోడ్డుపైనే కత్తితో కూతురితోపాటు ప్రేమికుడిని కూడా నరికాడు. ఎస్ఆర్ నగర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రేమికుడితో కలిసి అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా… 50 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అమ్మాయి నడిరోడ్డుపై రక్తపు మడుగులో అల్లాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి వారిని తరలించారు. తమపై దాడి చేసింది […]
హైదరాబాద్లో మరో తండ్రి కత్తిపట్టారు.. తన కూతురు మరొక యువకుడిని ప్రేమించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నడి రోడ్డుపైనే కత్తితో కూతురితోపాటు ప్రేమికుడిని కూడా నరికాడు. ఎస్ఆర్ నగర్ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రేమికుడితో కలిసి అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా… 50 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
అమ్మాయి నడిరోడ్డుపై రక్తపు మడుగులో అల్లాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి వారిని తరలించారు. తమపై దాడి చేసింది తన తండ్రేనని బాధితురాలు చెబుతోంది. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరికిన వ్యక్తి ఎవరు?. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఎంతకాలంగా కొనసాగుతోంది అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. రోడ్డుపైనే ఘటన జరగడంతో చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.