సార్క్ సమావేశాలకు భారత్ దూరం... అదే దారిలో మూడు దేశాలు

యూరీ ఘటన నేపథ్యంలో దౌత్యపరంగా పాకిస్తాన్‌పై ఒత్తిడిని భారత్ తీవ్ర తరం చేసింది. ఇందులో భాగంగా పాక్‌ వేదికగా జరగనున్న సార్క్ సమావేశాలకు వెళ్లకూడదని భారత్ నిర్ణయించింది. బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్టనిస్తాన్‌ కూడా సార్క్‌ సదస్సును బహిష్కరించే యోచనలో ఉన్నాయి. సార్క్ సమావేశాలకు ప్రదాని మోదీ వెళ్లడం లేదని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. అయితే భారత్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్‌, ఆఫ్టనిస్తాన్ కూడా సార్క్ సమావేశాలకు వెళ్లకపోతే దాని ప్రభావం పాకిస్థాన్‌పై తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. నవంబర్  19న […]

Advertisement
Update:2016-09-27 12:30 IST

యూరీ ఘటన నేపథ్యంలో దౌత్యపరంగా పాకిస్తాన్‌పై ఒత్తిడిని భారత్ తీవ్ర తరం చేసింది. ఇందులో భాగంగా పాక్‌ వేదికగా జరగనున్న సార్క్ సమావేశాలకు వెళ్లకూడదని భారత్ నిర్ణయించింది. బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్టనిస్తాన్‌ కూడా సార్క్‌ సదస్సును బహిష్కరించే యోచనలో ఉన్నాయి. సార్క్ సమావేశాలకు ప్రదాని మోదీ వెళ్లడం లేదని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. అయితే భారత్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్‌, ఆఫ్టనిస్తాన్ కూడా సార్క్ సమావేశాలకు వెళ్లకపోతే దాని ప్రభావం పాకిస్థాన్‌పై తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. నవంబర్ 19న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా సార్క్ సమ్మిట్ జరుగనున్న విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News