అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చివేస్తాం.. మళ్లీ తెర‌పైకి సెక్ష‌న్‌-8!

న‌గ‌రంలోని అక్ర‌మ క‌ట్ట‌డాల‌న్నీ కూల్చివేస్తాం.. హైద‌రాబాద్ స్తంభించిపోయేలా చేసిన వ‌ర‌ద‌కు అక్ర‌మ క‌ట్ట‌డాలే కార‌ణ‌మైనందున ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ఎవ‌రినీ ఉపేక్షించేదిలేద‌ని.. అక్ర‌మ నిర్మాణాల‌న్నీ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తామంటూ ప్ర‌క‌టించారు. ఇందుకోసం ప్రణాళిక ప్ర‌కారం ముందుకు వెళ‌తామ‌ని చెప్పారు. న‌గ‌రంలోని 24 స‌ర్కిళ్ల‌కు ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించి కూల్చివేత‌లు చేప‌డ‌తామ‌న్నారు. న‌గ‌రంలోని నాలాలను ఆక్ర‌మించి క‌ట్టిన నిర్మాణాల‌ను పూర్తిగా తొల‌గిస్తాం, వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టగానే కూల్చివేత‌లు మొద‌లు పెడ‌తామ‌న్నారు. ఈ ప్ర‌క‌ట‌నతో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను నిర్మించిన వారి గుండెల్లో […]

Advertisement
Update:2016-09-25 04:10 IST
న‌గ‌రంలోని అక్ర‌మ క‌ట్ట‌డాల‌న్నీ కూల్చివేస్తాం.. హైద‌రాబాద్ స్తంభించిపోయేలా చేసిన వ‌ర‌ద‌కు అక్ర‌మ క‌ట్ట‌డాలే కార‌ణ‌మైనందున ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ఎవ‌రినీ ఉపేక్షించేదిలేద‌ని.. అక్ర‌మ నిర్మాణాల‌న్నీ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తామంటూ ప్ర‌క‌టించారు. ఇందుకోసం ప్రణాళిక ప్ర‌కారం ముందుకు వెళ‌తామ‌ని చెప్పారు. న‌గ‌రంలోని 24 స‌ర్కిళ్ల‌కు ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించి కూల్చివేత‌లు చేప‌డ‌తామ‌న్నారు. న‌గ‌రంలోని నాలాలను ఆక్ర‌మించి క‌ట్టిన నిర్మాణాల‌ను పూర్తిగా తొల‌గిస్తాం, వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టగానే కూల్చివేత‌లు మొద‌లు పెడ‌తామ‌న్నారు. ఈ ప్ర‌క‌ట‌నతో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను నిర్మించిన వారి గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి.
టీడీపీ, సెక్ష‌న్‌-8కు అవ‌కాశం ఇవ్వ‌కుండా..!
తెలంగాణ ప్ర‌భుత్వం ఏ పని చేప‌ట్టినా అందులో తెలుగుదేశం పార్టీ వేలు పెడుతోంది. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌కూ అడ్డుత‌గులుతుంద‌న్న విష‌యం రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెలుసు. గ‌తంలో రాష్ట్రంలో నిషేధానికి గురైన‌ ఓ వ‌ర్గపు మీడియా కూడా గంప‌గుత్త‌గా ఇప్ప‌టికే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తోంది. ఈ స‌మ‌యంలో అక్ర‌మ నిర్మాణాల విష‌యంలో మీడియా, టీడీపీకి ర‌వ్వంత అవ‌కాశం ఇచ్చినా ర‌చ్చ‌ర‌చ్చ చేస్తారు. చెరువుల్లో అపార్ట్‌మెంట్లు, ఇళ్ల‌జాగాలు కొనుక్కుని నివ‌సిస్తున్న బాధితుల‌ను తెలుగుదేశం నేత‌లు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రెచ్చ‌గొడుతున్నార‌న్న స‌మాచారం ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంది. రెండేళ్ల కింద చెరువులో ఇళ్లు క‌ట్టిన ఓ హీరో క‌ట్ట‌డం కూల్చివేస్తే.. అత‌నికి మ‌ద్ద‌తుగా టీడీపీ, ఓ వ‌ర్గ‌పు మీడియా గొంతు చించుకున్న విష‌యం తెలిసిందే. అందుకే, ఈ విష‌యంలో కేటీఆర్ ఆచితూచి ప్ర‌క‌ట‌న చేశారు. కూల్చివేత‌లు చేప‌ట్టిన ప్ర‌తిసారీ న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించి స్టేలు తెచ్చుకుంటున్నారు. దీంతో కూల్చివేత‌ల ప్ర‌క్రియ ప్ర‌తిసారీ మ‌ధ్య‌లోనే ఆగిపోతోంద‌ని, ఈసారి అలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నామ‌న్నారు. న్యాయ‌నిపుణులు, అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ స‌ల‌హాలు, గ‌తంలో అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారం ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా కూల్చివేత‌లు మొద‌లు పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.
Click on Image to Read
Tags:    
Advertisement

Similar News