తన ఇంగ్లీష్‌పై తొలిసారి స్పందించిన చంద్రబాబు

చంద్రబాబు ఇంగ్లీష్‌పై ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. ఓటుకు నోటు డీలింగ్‌ సమయంలో మనవాళ్లు బ్రీఫ్డ్‌ మీ అన్న పదం తెగ పావులర్ అయింది. మంత్రి కేటీఆర్ ఏకంగా ఆడియో టేపుల్లో ఉన్న దరిద్రమైన ఇంగ్లీష్‌ ను బట్టే ఆ వాయిస్ చంద్రబాబుది అని చెప్పవచ్చని అప్పట్లో ఎద్దేవా చేశారు. సగం ఇంగ్లీష్, సగం తెలుగు కలిపి చంద్రబాబు వ్యాఖ్యాన్ని పూరించే విధానాన్ని చాలా మంది ఆసక్తిగా గమనిస్తుంటారు. జోకులు కూడా వేస్తుంటారు. […]

Advertisement
Update:2016-09-24 04:45 IST

చంద్రబాబు ఇంగ్లీష్‌పై ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. ఓటుకు నోటు డీలింగ్‌ సమయంలో మనవాళ్లు బ్రీఫ్డ్‌ మీ అన్న పదం తెగ పావులర్ అయింది. మంత్రి కేటీఆర్ ఏకంగా ఆడియో టేపుల్లో ఉన్న దరిద్రమైన ఇంగ్లీష్‌ ను బట్టే ఆ వాయిస్ చంద్రబాబుది అని చెప్పవచ్చని అప్పట్లో ఎద్దేవా చేశారు. సగం ఇంగ్లీష్, సగం తెలుగు కలిపి చంద్రబాబు వ్యాఖ్యాన్ని పూరించే విధానాన్ని చాలా మంది ఆసక్తిగా గమనిస్తుంటారు. జోకులు కూడా వేస్తుంటారు. విదేశీ నేతలు వచ్చినప్పుడు బాబు ఇంగ్లీష్ అర్ధంకాక దుబాసీలను పెట్టుకున్న సందర్భాలను గుర్తుచేస్తుంటారు.

ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా పరవాడలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు… తన ఇంగ్లీష్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. “నాకు ఇంగ్లీష్‌ మాట్లాడడం రాదా… నేను ఎస్వీ యూనివర్శిటీలో ఎంఎ, పీహెచ్‌డీ పూర్తి చేశా. ప్రపంచ దేశాలు మెచ్చే ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఐటీని అభివృద్ధి చేసిందే నేను” అని చంద్రబాబు చెప్పారు. దేశంలోనే టాప్‌ సీఎంగా ఉన్నానని ప్రకటించుకున్నారు. అలాంటి తనకు ఇంగ్లీష్‌ రాదు అనడం ఏమిటని ప్రశ్నించారు చంద్రబాబు. జగన్‌ పెట్టే సదస్సులకు పిల్లలను పంపవద్దని తల్లిదండ్రులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌ సభకు వెళ్లే పిల్లలు కూడా అలాగే తయారవుతారని చంద్రబాబు హెచ్చరించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News