సార్‌... మీరైనా జోక్యం చేసుకోండి...

హైదరాబాద్‌ శివారు రాయదుర్గంలోని భూ కుంభకోణంతోపాటు, రెండు పాన్‌కార్డులు కలిగివున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తపల్లి గీత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని ఆశ్రయించారు. ఈ వివాదం నుంచి గట్టెక్కించాలని ఆమె కోరినట్టు తెలుస్తోంది.   రాయదుర్గంలోని భూములు తమవేనని, దీనికి సంబంధించి హైకోర్టుకూడా గతంలో తమకు అనుకూలంగా రెండుసార్లు తీర్పుఇచ్చిందని హోం మంత్రి రాజ్‌నాథ్‌ దగ్గర మొరపెట్టుకున్నారు. ఈ భూమికి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను ప్రభుత్వానికి అందించినా, కావాలనే రెవెన్యూ శాఖ తమ భూమిని ప్రైవేటు […]

Advertisement
Update:2016-09-23 14:48 IST

హైదరాబాద్‌ శివారు రాయదుర్గంలోని భూ కుంభకోణంతోపాటు, రెండు పాన్‌కార్డులు కలిగివున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తపల్లి గీత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని ఆశ్రయించారు. ఈ వివాదం నుంచి గట్టెక్కించాలని ఆమె కోరినట్టు తెలుస్తోంది. రాయదుర్గంలోని భూములు తమవేనని, దీనికి సంబంధించి హైకోర్టుకూడా గతంలో తమకు అనుకూలంగా రెండుసార్లు తీర్పుఇచ్చిందని హోం మంత్రి రాజ్‌నాథ్‌ దగ్గర మొరపెట్టుకున్నారు. ఈ భూమికి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను ప్రభుత్వానికి అందించినా, కావాలనే రెవెన్యూ శాఖ తమ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆమె రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని హోం మంత్రిని కోరినట్టు ఆమె తెలిపారు. దీనిపై త్వరలోనే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించనున్నట్టు కొత్తపల్లి గీత వెల్లడించారు. అయితే రాజ్‌నాథ్‌ సింగ్ నుంచి ఆమెకు ఎలాంటి హామీ రాలేదని చెబుతున్నారు.

ఎంపీ కొత్తపల్లి గీత గతంలో ఆమె డిప్యుటీ కలెక్టర్‌గా వున్న సమయంలోనే ఆమె భర్త పీఆర్‌కే రావుతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి, రిజిస్ట్రార్‌ను ప్రలోభపెట్టి ఆ భూమిని ధృవీకరంప చేసుకున్నట్టు సీబీఐ విచారణలో తేలింది. మొత్తం 99.07 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని నకిలి డాక్యుమెంట్లు సృష్టించి అమ్మేశారని విచారణలో బయటపడింది. అంతేకాక నకిలీ సేల్‌డీడ్లు సృష్టించి వాటిని బ్యాంక్‌ హామీగా పెట్టి కోట్లాది రూపాయలు రుణం తీసుకుని బ్యాంకునూ మోసం చేశారని విచారణలో తేలింది. ప్రస్తుతం సీరియస్‌గా కేసు దర్యాప్తు జరుగుతుండడంతో కొత్తపల్లి గీత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారని చెబుతున్నారు. అయినా భూముల పంచాయతీలను కూడా కేంద్రం హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఏంటో!. కొత్తపల్లి గీత ఆక్రయించిన భూమి విలువ రూ. 5వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News