ఒక్క అడుగు పెరిగితే... హుస్సేన్‌సాగర్ నిండినట్లే! నేడు, రేపు రాజధానిలో విద్యాసంస్థలకు సెలవు
హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. నాలాల నుంచి నిరంతరాయంగా వస్తోన్న వరదనీటితో హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 514 అడుగులు కాగా.. ప్రస్తుతం 513 అడుగులకు చేరుకుంది. అంటే పూర్తిస్థాయి మట్టాన్ని చేరుకోవడానికి కేవలం ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉంది. మరోరెండురోజులు వరదలు ఇదేస్థాయిలో కొనసాగితే ట్యాంక్ బండ్ పొంగిపొర్లడం ఖాయం. ఇప్పటికే దాదాపుగా పూర్తిస్థాయి నీటిమట్టం చేరిన కారణంగా అలలు వచ్చినపుడు ఆనకట్టపై నీళ్లు ఎగచిమ్ముతున్నాయి. ట్యాంక్‌బండ్ మధ్యలో ఉన్న […]
Advertisement
హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. నాలాల నుంచి నిరంతరాయంగా వస్తోన్న వరదనీటితో హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 514 అడుగులు కాగా.. ప్రస్తుతం 513 అడుగులకు చేరుకుంది. అంటే పూర్తిస్థాయి మట్టాన్ని చేరుకోవడానికి కేవలం ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉంది. మరోరెండురోజులు వరదలు ఇదేస్థాయిలో కొనసాగితే ట్యాంక్ బండ్ పొంగిపొర్లడం ఖాయం. ఇప్పటికే దాదాపుగా పూర్తిస్థాయి నీటిమట్టం చేరిన కారణంగా అలలు వచ్చినపుడు ఆనకట్టపై నీళ్లు ఎగచిమ్ముతున్నాయి. ట్యాంక్‌బండ్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం ఐలాండ్‌పైకి నీళ్లు చేరినట్లు సమాచారం.
దీంతో ఆనకట్ట పరిసర ప్రాంతాలైన లోయర్‌ట్యాంక్ బండ్, కవాడిగూడ ప్రాంతాల బస్తీవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన అధికారులు ముప్పు అధికంగా ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిన్నటిదాకా స్థిరంగా కొనసాగిన వరద శుక్రవారం ఉదయానికి మరింత పెరిగింది. దీంతో వచ్చిన వరదనీటిని వచ్చినట్లుగానే అధికారులు కిందకి వదులుతున్నారు. నిన్నటి మొన్నటిదాకా 4000 క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు, శుక్రవారం నుంచి 500 క్యూసెక్కులు అదనంగా అంటే 4,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
భారీ వర్షాల కారణంగా నగరంలో దాదాపుగా అన్ని రోడ్లు ధ్వంసమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దించింది. హైదరాబాద్‌లో విద్యాసంస్థలు, స్కూళ్లకు నేడు, రేపు సెలవు ప్రకటించింది. దీంతో రోడ్లపై స్కూలు బస్సులు, వ్యానులు, ఇతర వాహనాల సంఖ్యను పూర్తిగా తగ్గించినట్లయింది. ఈలోపు రోడ్లు, డ్రైనేజీల మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా ఈనిర్ణయం తీసుకుంది.
Advertisement