అల్లు అర్జుణ్ నెక్స్ట్ సినిమా స్టోరీ లీక్ అయ్యిందా?

మొత్తానికి అల్లు అర్జుణ్ మరియు తమిళ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా? లేదా? అనే సస్పెన్స్‌కి మాత్రం తెర పడింది. రాబోయే సంవత్సరం ఫిబ్రవరిలో సినిమా మొదలవుతుందని అఫీషియల్‌గా కూడా ప్రకటించడం జరిగింది. ఈ సినిమా కార్తి నటించిన డెబ్యూ మూవీ ‘పరుత్తివీరన్’ సినిమా లైన్స్‌లో ఉంటుందని స్వయంగా స్టూడియో గ్రీన్ ఙ్ఞానవేల్ రాజా స్టోరీ హింట్ ఇచ్చారు.   ‘పరుత్తివీరన్’ లో కార్తి ఒక గూండా క్యారెక్టర్ చేశాడు. తను చిన్న చిన్న నేరాలు […]

Advertisement
Update:2016-09-23 13:39 IST
మొత్తానికి అల్లు అర్జుణ్ మరియు తమిళ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా? లేదా? అనే సస్పెన్స్‌కి మాత్రం తెర పడింది. రాబోయే సంవత్సరం ఫిబ్రవరిలో సినిమా మొదలవుతుందని అఫీషియల్‌గా కూడా ప్రకటించడం జరిగింది. ఈ సినిమా కార్తి నటించిన డెబ్యూ మూవీ ‘పరుత్తివీరన్’ సినిమా లైన్స్‌లో ఉంటుందని స్వయంగా స్టూడియో గ్రీన్ ఙ్ఞానవేల్ రాజా స్టోరీ హింట్ ఇచ్చారు.
‘పరుత్తివీరన్’ లో కార్తి ఒక గూండా క్యారెక్టర్ చేశాడు. తను చిన్న చిన్న నేరాలు చేస్తూ పోలీసులతో ఆడుకుంటుంటాడు. తనపై మనసు పారేసుకున్న హీరోయిన్ పై పిచ్చి వ్యామోహం పెంచుకున్న తర్వాత, అనుకోని పరిణామాలతో కథ మలుపులు తిరిగి దుఃఖాంతం అవుతుంది. అంటే అల్లు అర్జుణ్ కూడా గూండా క్యారెక్టరే చేసున్నాడా? దుఃఖాంతం మాత్రం అవ్వదని మనం ఊహించుకోవచ్చు. ఏమంటారు?
Tags:    
Advertisement

Similar News