బాబు గుండెల్లో గుచ్చుకునే డైలాగ్‌లు చెప్పిన రేవంత్

ఎక్కడైనా ఒక పార్టీ అంటే దానికి కొన్ని సిద్ధాంతాలు, విధానాలు ఉంటాయి. కానీ టీడీపీ తీరు మాత్రం విచిత్రంగా ఉంది. సరిహద్దులు మారితే సిద్ధాంతాలు మారిపోతున్నాయి. తాజాగా తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని మూడు నెలల్లో తేల్చాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా రేవంత్‌ మీడియాతో విలువల గురించి మాట్లాడారు. ఆయన చెప్పిన విలువలు, నీతు సూత్రాలు కేసీఆర్‌తో పాటు చంద్రబాబుకూ వర్తించేవే. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌కు, స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు […]

Advertisement
Update:2016-09-21 06:37 IST

ఎక్కడైనా ఒక పార్టీ అంటే దానికి కొన్ని సిద్ధాంతాలు, విధానాలు ఉంటాయి. కానీ టీడీపీ తీరు మాత్రం విచిత్రంగా ఉంది. సరిహద్దులు మారితే సిద్ధాంతాలు మారిపోతున్నాయి. తాజాగా తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని మూడు నెలల్లో తేల్చాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా రేవంత్‌ మీడియాతో విలువల గురించి మాట్లాడారు. ఆయన చెప్పిన విలువలు, నీతు సూత్రాలు కేసీఆర్‌తో పాటు చంద్రబాబుకూ వర్తించేవే. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌కు, స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అన్నారు. ఈ మాట చంద్రబాబు, కోడెల శివప్రసాద్‌కు వర్తించేదే. అంతే కాదు కేసీఆర్‌ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బర్రెలదొడ్డిలో కట్టేసుకున్నారని రేవంత్ అన్నారు.

ఇక్కడ కేసీఆర్‌ ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుగోలు చేశారంటే అక్కడ చంద్రబాబు కూడా వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఏ లెక్కలోకి వస్తుందో!. శాసనాలు చేయాల్సిన వ్యక్తులే శాసనాలు ఉల్లంఘిస్తే సభ్యసమాజం చీ కొడుతుందని చెప్పారు రేవంత్. ఫిరాయింపులు ప్రోత్సహించడం వంటి తప్పుడు నిర్ణయాల వల్ల అధికార పార్టీకి తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని మరో ఆణిముత్యాన్ని కూడా రేవంత్ రెడ్డి వదిలారు. మరి ఈ ఆణిముత్యాలు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు వర్తించవా?. ప్రజాస్వామ్యం తెలంగాణలో బతికితే చాలా, ఆంధ్రప్రదేశ్‌లో ఖూనీ అయినా పర్వాలేదా?. కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి చెబుతున్న నీతులన్నీ చంద్రబాబుకు కూడా వర్తించాలి కదా!. రాష్ట్ర విభజనలో కాకుండా ఫిరాయింపులు, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి విషయాల్లోనూ టీడీపీ రెండు చిప్పల సిద్ధాంతాన్నే ఫాలో అవుతున్నట్టుగా ఉంది. జనం అమాయకులు తామేమీ చెప్పినా కరెక్ట్‌ అనుకుంటారన్న నమ్మకం కాబోలు.

Tags:    
Advertisement

Similar News