గరిష్ట నీటిమట్టానికి హుస్సేన్ సాగర్... లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరిక!
కుండపోతలా కురుస్తోన్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరరహదారులు చెరువులను తలపించాయి. నాలాలు పొంగిపొర్లుతుండటంతో హుస్సేన్‌సాగర్ వరదనీరు భారీగావచ్చి చేరుతోంది. క్షణక్షణానికి నీటిమట్టం పెరిగిపోతోంది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టం దాటిపోవడంతో హుస్సేన్‌సాగర్ నుంచి పెద్ద స్థాయిలో నీటిని కిందికి వదిలేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. హుస్సేన్‌సాగర్ నాలా వెంబడి ఉన్న కవాడిగూడ, లోయర్‌ట్యాంక్ బండ్ తదితరప్రాంతాల వారికి […]
Advertisement
కుండపోతలా కురుస్తోన్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరరహదారులు చెరువులను తలపించాయి. నాలాలు పొంగిపొర్లుతుండటంతో హుస్సేన్‌సాగర్ వరదనీరు భారీగావచ్చి చేరుతోంది. క్షణక్షణానికి నీటిమట్టం పెరిగిపోతోంది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టం దాటిపోవడంతో హుస్సేన్‌సాగర్ నుంచి పెద్ద స్థాయిలో నీటిని కిందికి వదిలేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. హుస్సేన్‌సాగర్ నాలా వెంబడి ఉన్న కవాడిగూడ, లోయర్‌ట్యాంక్ బండ్ తదితరప్రాంతాల వారికి ఇప్పటికే హెచ్చరికలుజారీ చేశారు. గరిష్ట నీటిమట్టానికి చేరుకున్న హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది.
Advertisement