ఇలాగైతే జగన్‌కు ఈసారి లక్ష మెజారిటీ- మీడియాతో టీడీపీ నేతలు

శాసనమండలి డిప్యూటీ చైర్మన్, పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డిపై సొంతపార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఏకంగా మీడియాకు ఎక్కారు. సతీష్ కుమార్ రెడ్డి బారి నుంచి పార్టీని కాపాడాలని మీడియాముఖంగా పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు భాస్కర్ రెడ్డి, రమేష్, పాపిరెడ్డి, వెంకటయ్య, కృష్ణారెడ్డిలు ఉమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టారు. చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధించిన ప్లెక్సీలను తాము ఏర్పాటు చేయిస్తే వాటిని సతీష్ రెడ్డి అనుచరులు ధ్వంసం చేశారని ఆరోపించారు. […]

Advertisement
Update:2016-09-20 08:29 IST

శాసనమండలి డిప్యూటీ చైర్మన్, పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డిపై సొంతపార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఏకంగా మీడియాకు ఎక్కారు. సతీష్ కుమార్ రెడ్డి బారి నుంచి పార్టీని కాపాడాలని మీడియాముఖంగా పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు భాస్కర్ రెడ్డి, రమేష్, పాపిరెడ్డి, వెంకటయ్య, కృష్ణారెడ్డిలు ఉమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టారు. చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధించిన ప్లెక్సీలను తాము ఏర్పాటు చేయిస్తే వాటిని సతీష్ రెడ్డి అనుచరులు ధ్వంసం చేశారని ఆరోపించారు. పార్టీలో వర్గాలను సతీష్‌ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

గతంలో పులివెందుల నియోజకవర్గం నుంచి కందుల రాజమోహన్ రెడ్డి పోటీ చేస్తే టీడీపీకి అత్యధిక ఓట్లు వచ్చాయన్నారు. కానీ సతీష్‌ రెడ్డి నాలుగుసార్లు పోటీ చేస్తే వరుసగా 30 వేలు, 49వేలు, 60వేలు, 70వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సతీష్ రెడ్డి తీరు చూస్తుంటే 2019 ఎన్నికల్లో జగన్‌కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమనిపిస్తోందన్నారు. సతీష్ రెడ్డి కోసం గతంలో ధర్నాలు చేసి కేసుల్లో ఇరుక్కున్న వారికి కూడా ఆయన న్యాయం చేయలేకపోతున్నారని పులివెందుల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Click on Image to Read:

Advertisement

Similar News