నన్ను అరెస్ట్ చేస్తే విడుదలైన తర్వాత...
దేశ రాజకీయాల్లో చంద్రబాబును మించిన రాక్షసుడు మరొకరు లేరని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. అలాంటి రాక్షసుడి చేతిలో ఆంధ్రప్రదేశ్ చిక్కుకోవడం ప్రజల దురదృష్టమన్నారు. తుని ఘటనలో సీఐడీ విచారణకు హాజరైన భూమన కరుణాకర్ రెడ్డి…తుని ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ చేస్తే విడుదలైన తర్వాత కాపు ఉద్యమంలో ఒక కార్యకర్తలాగా ప్రత్యక్షంగా పాల్గొంటానని భూమన చెప్పారు. కుట్రలు,కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు కూనీరాగాలు తీసినంత సులువని మండిపడ్డారు. […]
దేశ రాజకీయాల్లో చంద్రబాబును మించిన రాక్షసుడు మరొకరు లేరని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. అలాంటి రాక్షసుడి చేతిలో ఆంధ్రప్రదేశ్ చిక్కుకోవడం ప్రజల దురదృష్టమన్నారు. తుని ఘటనలో సీఐడీ విచారణకు హాజరైన భూమన కరుణాకర్ రెడ్డి…తుని ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ చేస్తే విడుదలైన తర్వాత కాపు ఉద్యమంలో ఒక కార్యకర్తలాగా ప్రత్యక్షంగా పాల్గొంటానని భూమన చెప్పారు. కుట్రలు,కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు కూనీరాగాలు తీసినంత సులువని మండిపడ్డారు. కాపు ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చామన్న ఉద్దేశంతోనే వైసీపీని చంద్రబాబు వెంటాడుతున్నారని విమర్శించారు. వైసీపీని నాశనం చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. సీఐడీ పదేపదే విచారణకు పిలిచి ఇబ్బంది పెట్టినంత మాత్రాన బెదిరిపోయే మనస్తత్వం తనది కాదన్నారు.
Click on Image to Read: