వైఎస్ సీక్రెట్ అదే, ఇప్పుడు జగన్ కూడా ఆలోచించుకోవాలి
ప్రతిపక్షంగా ప్రభుత్వంపై వైసీపీ పూర్తి స్థాయిలో పోరాటం చేయాలన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. గతంలో వైఎస్ రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా చేసినా ఆయనకు అనుకున్నంత పేరు రాలేదన్నారు. కానీ 1999 నుంచి 2004 మధ్యలో ప్రతిపక్ష నేతగా ఆయన స్వర్ణ యుగం నడిచిందన్నారు. అసెంబ్లీలో వైఎస్ లేచి మాటలతో కొడుతుంటే చంద్రబాబుకు దిమ్మతిరిగేదన్నారు. అందుకు కారణం చుట్టూ ఎవరిని టీంగా పెట్టుకోవాలో వైఎస్ గుర్తించడమేనన్నారు. ఇప్పుడు జగన్ కూడా ఆ విషయంలో ఆలోచించుకోవాలన్నారు. […]
ప్రతిపక్షంగా ప్రభుత్వంపై వైసీపీ పూర్తి స్థాయిలో పోరాటం చేయాలన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. గతంలో వైఎస్ రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా చేసినా ఆయనకు అనుకున్నంత పేరు రాలేదన్నారు. కానీ 1999 నుంచి 2004 మధ్యలో ప్రతిపక్ష నేతగా ఆయన స్వర్ణ యుగం నడిచిందన్నారు. అసెంబ్లీలో వైఎస్ లేచి మాటలతో కొడుతుంటే చంద్రబాబుకు దిమ్మతిరిగేదన్నారు. అందుకు కారణం చుట్టూ ఎవరిని టీంగా పెట్టుకోవాలో వైఎస్ గుర్తించడమేనన్నారు. ఇప్పుడు జగన్ కూడా ఆ విషయంలో ఆలోచించుకోవాలన్నారు. అలాంటి మేధావులు, వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని ఉండవల్లి చెప్పారు.
రాజశేఖర్ రెడ్డి కుమారుడైన జగన్ బాగుండాలనే తానూ కోరుకుంటానన్నారు. చంద్రబాబు చెబుతున్న విషయాలకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. పోలవరాన్ని కాపర్ డ్యాంతో నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు. కాపర్ డ్యాం అన్నది గట్టిగా ఊదితే ఎగిరిపోతుందన్నారు. అలాంటి దానితో పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం ప్రపంచంలోనే అద్బుతమన్నారు. పవన్ కల్యాణ్ ముందు రాజకీయాల్లోకి వస్తే ఆయన భవిష్యత్తు ఏంటన్నది అంచనా వేయడానికి వీలవుతుందన్నారు. కాకినాడ సభకు జనం వచ్చినా పవన్ ప్రసంగం మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందన్నారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్క సినిమా డైలాగ్ కూడా చెప్పకుండా సీరియస్‌గా రాజకీయం మాట్లాడారని గుర్తు చేశారు. టీవీ 9 ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
Click on Image to Read: