వైసీపీలో చేరికపై స్పందించిన వంశీ

తాను టీడీపీ వీడి వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ అభిమానిగానే ఉంటానన్నారు. పార్టీ వీడుతున్నట్టు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని డీసీపీ, సీపీల దృష్టికి తీసుకెళ్తానన్నారు. దేవినేని నెహ్రు రాక పట్ల తాను అసంతృప్తిగా లేనన్నారు. చంద్రబాబు నిర్ణయం తమకు శిరోధార్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం సీటు రాదన్న భయం తనకు […]

Advertisement
Update:2016-09-18 12:51 IST

తాను టీడీపీ వీడి వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ అభిమానిగానే ఉంటానన్నారు. పార్టీ వీడుతున్నట్టు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని డీసీపీ, సీపీల దృష్టికి తీసుకెళ్తానన్నారు. దేవినేని నెహ్రు రాక పట్ల తాను అసంతృప్తిగా లేనన్నారు. చంద్రబాబు నిర్ణయం తమకు శిరోధార్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం సీటు రాదన్న భయం తనకు లేదన్నారు. చంద్రబాబు ఏ పని అప్పగిస్తే అది చేస్తానన్నారు. మరో కార్యక్రమం ఉండడం వల్లే దేవినేని నెహ్రు చేరిక మీటింగ్‌కు హాజరుకాలేకపోయానని వంశీ చెప్పారు. దేవినేని నెహ్రుతో తేడా వస్తే.. పార్టీ అధ్యక్షుడే చూసుకుంటారని ఒక మీడియా సంస్థతో వంశీ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News