మళ్లీ తెగబడ్డ ఉగ్రమూకలు... 17మంది జవాన్లు మృతి

ఉగ్రవాదులు భారత్‌పై మరోసారి తెగబడ్డారు. జమ్ముకాశ్మీర్ బారామూల్లాలో యూరి సెక్టార్‌లోని ఆర్మీ బెటాలియన్‌ కేంద్రంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దాడిలో 17మంది జవాళ్లు చనిపోయారు. మరో 20మంది గాయపడ్డారు. దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. తెల్లవారుజామున చిమ్మచీకటిలో ఉగ్రవాదులు కంచె తొలగించి ఆర్మీ యూరీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు. అనంతరం విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు, బాంబులు పేల్చారు. వెంటనే తేరుకున్న భారత ఆర్మీ ఎదురుదాడి చేసింది. కొన్ని గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. […]

Advertisement
Update:2016-09-18 07:40 IST

ఉగ్రవాదులు భారత్‌పై మరోసారి తెగబడ్డారు. జమ్ముకాశ్మీర్ బారామూల్లాలో యూరి సెక్టార్‌లోని ఆర్మీ బెటాలియన్‌ కేంద్రంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దాడిలో 17మంది జవాళ్లు చనిపోయారు. మరో 20మంది గాయపడ్డారు. దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. తెల్లవారుజామున చిమ్మచీకటిలో ఉగ్రవాదులు కంచె తొలగించి ఆర్మీ యూరీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు. అనంతరం విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు, బాంబులు పేల్చారు. వెంటనే తేరుకున్న భారత ఆర్మీ ఎదురుదాడి చేసింది. కొన్ని గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌ సీఎం, గవర్నర్‌తో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News