స్వామి అసిమానందకు బెయిల్‌

ముస్లిం ఉగ్రవాదానికి ప్రతీకారంగా కొన్ని ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి అసిమానందకు హర్యానా న్యాయస్థానం శుక్రవారంనాడు బెయిల్‌ మంజూరు చేసింది. స్వామి అసిమానంద మక్కామసీదు బాంబు పేలుళ్ల కేసులోనూ, అజ్మీర్‌ దర్గాలో బాంబు పేలుళ్ల కేసులోనూ, సంఝాతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్ల కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. 2007 ఫిబ్రవరి 18న ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానిపట్ వద్ద సంఝాతా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన బాంబు పేలుడులో 68 మంది పాకిస్తాన్‌ పౌరులు చనిపోయారు. […]

Advertisement
Update:2016-09-17 09:40 IST

ముస్లిం ఉగ్రవాదానికి ప్రతీకారంగా కొన్ని ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి అసిమానందకు హర్యానా న్యాయస్థానం శుక్రవారంనాడు బెయిల్‌ మంజూరు చేసింది.

స్వామి అసిమానంద మక్కామసీదు బాంబు పేలుళ్ల కేసులోనూ, అజ్మీర్‌ దర్గాలో బాంబు పేలుళ్ల కేసులోనూ, సంఝాతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్ల కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు.

2007 ఫిబ్రవరి 18న ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానిపట్ వద్ద సంఝాతా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన బాంబు పేలుడులో 68 మంది పాకిస్తాన్‌ పౌరులు చనిపోయారు. 2007 మే 18న హైదరాబాద్‌ పాతబస్తీలోని మక్కామసీదులో జరిగిన బాంబు పేలుళ్లలో చాలామంది చనిపోయారు. అలాగే అజ్మీర్‌ దర్గాలో జరిగిన బాంబు పేలుళ్లలో ప్రాణ నష్టం జరిగింది. ఈ మూడు సంఘటనల్లోనూ వాడిన బాంబులు ఒకేవిధంగా ఉండడం, నేరం జరిగిన తీరు వీటిని బట్టి ఈ మూడు నేరాల వెనుక ఉన్న కీలక నిందితుడు స్వామి అసిమానంద అని భారత దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. 2010లో స్వామి అసిమానందను అరెస్టు చేశాయి.

ఇప్పటికే ఆయనకు అజ్మీర్‌ కేసులో బెయిల్‌ లభించింది. ఇప్పుడు సంఝాతా ఎక్స్‌ప్రెస్‌ కేసులో శుక్రవారం నాడు బెయిల్‌ లభించింది. ఇక మక్కామసీదు కేసులో ఆయనకు బెయిల్‌ లభిస్తుందో లేదో చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News