బాలయ్య తుపాకీకి ముద్రగడ వియ్యంకుడి రివాల్వర్

ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలో కాపు నేత ముద్రగడ పద్మనాభం.. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటనను పదేపదే ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణను కాల్పుల కేసు నుంచి రక్షించుకునేందుకు అర్థరాత్రి వైఎస్‌ ఇంటికి వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని ముద్రగడ చెబుతున్నారు. చంద్రబాబు వియ్యంకుడి తుపాకి మ్యాటర్‌ను ముద్రగడ ప్రస్తావిస్తుంటే… టీడీపీ కూడా ముద్రగడ వియ్యంకుడిని టార్గెట్ చేసింది. బామ్మర్దిని ఇబ్బంది పెడుతుంటే బావకు ఎలా ఉంటుందో చూపెట్టాలనుకున్నారో ఏమో గానీ ముద్రగడ వియ్యంకుడికి నోటీసులు జారీ […]

Advertisement
Update:2016-09-16 16:51 IST

ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలో కాపు నేత ముద్రగడ పద్మనాభం.. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటనను పదేపదే ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణను కాల్పుల కేసు నుంచి రక్షించుకునేందుకు అర్థరాత్రి వైఎస్‌ ఇంటికి వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని ముద్రగడ చెబుతున్నారు. చంద్రబాబు వియ్యంకుడి తుపాకి మ్యాటర్‌ను ముద్రగడ ప్రస్తావిస్తుంటే… టీడీపీ కూడా ముద్రగడ వియ్యంకుడిని టార్గెట్ చేసింది. బామ్మర్దిని ఇబ్బంది పెడుతుంటే బావకు ఎలా ఉంటుందో చూపెట్టాలనుకున్నారో ఏమో గానీ ముద్రగడ వియ్యంకుడికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.

కాపు నేతల సమావేశానికి కల్యాణమండలం ఇవ్వడంతోనే ఆయనకు నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు. అంతే కాదు తుపాకీ లైసెన్స్ వెనక్కు ఇచ్చేయాలని ముద్రగడ వియ్యంకుడికి పోలీసులు ఆదేశించారు. దీనిపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. తన వియ్యంకుడికి, తుపాకీకి తనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ‘రివాల్వర్ వాడింది చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ. నేనేమీ ఆయనలా రివాల్వర్ వాడను’ అని ముద్రగడ అన్నారు. భార్య తుపాకీని కూడా వాడిన వ్యక్తి బాలకృష్ణ అని విమర్శించారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు చంద్రబాబు కూడా బామ్మర్ది బాధను బామ్మర్ది ద్వారా తెలియజేయాలనుకుంటున్నట్టుగా ఉన్నారు.

Click on Image to Read:

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News