ఇక నాలుకలు కోయడమే... జలీల్‌ఖాన్‌ మళ్లీ వేసేశాడు

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్…మరోసారి వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. ఎయిర్‌ పోర్టు నుంచి వెళ్తుంటే దేవినేని నెహ్రూ ఇంటి వైపు చూసేవాడినని, ఇక్కడ కూడా పసుపు రంగు కళకళలాడితే విజయవాడ మొత్తం టీడీపీకే అంకితం అయిపోతుందని అనుకునే వాడినన్నారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. దేవినేని నెహ్రు కోసం జగన్ పార్టీ కూడా ట్రై చేసిందని ఆ సమయంలో పిల్లకాకిని నమ్ముకుని పార్టీలోకి వెళ్తే నష్టపోతావంటూ నెహ్రుకు తాను సలహా […]

Advertisement
Update:2016-09-15 16:00 IST
ఇక నాలుకలు కోయడమే... జలీల్‌ఖాన్‌ మళ్లీ వేసేశాడు
  • whatsapp icon

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్…మరోసారి వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. ఎయిర్‌ పోర్టు నుంచి వెళ్తుంటే దేవినేని నెహ్రూ ఇంటి వైపు చూసేవాడినని, ఇక్కడ కూడా పసుపు రంగు కళకళలాడితే విజయవాడ మొత్తం టీడీపీకే అంకితం అయిపోతుందని అనుకునే వాడినన్నారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. దేవినేని నెహ్రు కోసం జగన్ పార్టీ కూడా ట్రై చేసిందని ఆ సమయంలో పిల్లకాకిని నమ్ముకుని పార్టీలోకి వెళ్తే నష్టపోతావంటూ నెహ్రుకు తాను సలహా ఇచ్చానన్నారు. తాను పార్టీ మారేందుకు 30కోట్లు తీసుకున్నానని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని.. కానీ తనకు చంద్రబాబు 30 పైసలు కూడా ఇవ్వలేదని చెప్పారు. కావాలంటే వేదిక మీద ఉన్న చంద్రబాబునే అడగాలన్నారు.

వైఎస్‌ఆర్‌, ఆయన అనుచరులు కలిసి రాష్ట్రాన్ని దోచేశారని.. ఆ క్రమంలో నేల మీద ఇసుక కూడా లేకుండా నాలుకతో నాకేశారని జలీల్‌ ఖాన్ విమర్శించారు. ఇప్పుడు కృష్టా జిల్లా మొత్తం టీడీపీ అయిపోయిందని… ఎవడైనా మాట్లాడితే నాలుకలు కత్తిరించడమే తప్ప మాటలుండవని జలీల్‌ ఖాన్ హెచ్చరించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే…వైఎస్‌, ఆయన అనుచరులు కలిసి నేల మీద ఇసుకను కూడా నాకేసి ఉంటే మరి ఎన్నికల ముందే ఆ విషయం తెలిసి కూడా జలీల్‌ఖాన్ వైసీపీలో ఎందుకు చేరారో!. జగన్‌ ఇప్పటి కంటే పార్టీ పెట్టిన సమయంలో ఇంకా జూనియర్‌ కదా… అప్పుడు ఆ పిల్ల కాకి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో!. అయినా పార్టీ ఫిరాయించి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తిరుగుతున్న వాళ్లకు ఈ లాజిక్‌ లు ఎక్కడ ఎక్కుతాయి?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News