యాపిల్ ఫోన్‌ల అడ్డా భారత్
రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఫోన్లు ఎక్స్‌పోర్ట్
Advertisement
యాపిల్ ఫోన్‌ల తయారీ అడ్డగా భారత్ మారింది. 2024లో ఇండియా నుంచి రూ.1.08 లక్షల కోట్లకు పైగా విలువైన ఐ ఫోన్‌లు ఎక్స్‌పోర్ట్ చేశారు. ఐఫోన్‌ల తయారీలో వృద్ధి 46 శాతం పెరుగగా, ఎగుమతుల్లో వృద్ధి 42 శాతం పెరిగిందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఒక్క క్యాలెండర్ ఇయర్ లో ఇండియాలో రూ.1.48 లక్షల కోట్లకు పైగా విలువైన యాపిల్ ఫోన్‌లు తయారు చేశారు. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ సంస్థలు ఇండియాలో ఐఫోన్లను తయారు చేస్తున్నారు. వీటి ద్వారా దేశంలో 1.85 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కగా వారిలో 70 శాతం మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఐఫోన్ల తయారీలో భారత్ వాటా 14 శాతం ఉండగా రానున్న కొన్ని సంవత్సరాల్లోనే ఇది 26 శాతానికి పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Advertisement