సీడబ్ల్యూసీ చైర్మన్ గా ముకేశ్ కుమార్ సిన్హా
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
Advertisement
సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్‌గా ముకేశ్ కుమార్ సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించిది. ఈ మేరకు డీవోపీటీ అండర్ సెక్రటరీ కుందన్ నాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. సిన్హా ప్రస్తుతం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా హైదరాబాద్ లో పని చేస్తున్నారు. ఆయన స్థానంలో జీఆర్‌ఎంబీ చైర్మన్ గా ఇంకా ఎవరిని నియమించలేదు. సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్విందర్ ఓహ్రా రిటైర్ కావడంతో 2024 అక్టోబర్ ఒకటో తేదీన కేంద్ర జలశక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ రమేశ్ కుమార్ వర్మ మూడు నెలల పదవీకాలం కోసం సీడబ్ల్యూసీ చైర్మన్‌గా నియమించారు. ఆయన పదవీకాలం ముగియడంతో పదోన్నతి ముకేశ్ కుమార్ సిన్హాను కొత్త సీడబ్ల్యూసీ చైర్మన్ గా నియమించారు.
Advertisement