ఏపీలో జోరందుకున్న కోడిపందేలు
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు
Advertisement
సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో జోరుగా కోడిపందేలు సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గోదావరి జిల్లాల వాసులు పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు తిరిగి రాగా.. కోడిపందేలు చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా తెలంగాణ, కర్నాటక నుంచి అభిమానులు గోదావరి జిల్లాలకు పోటెత్తారు. కొబ్బరి తోటల్లో ఏర్పాటు చేసిన బరుల్లో పందేలు సాగుతున్నాయి. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరి పందేలు నిర్వహిస్తున్నారు.
Advertisement