భోగి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో కుటుంబ సభ్యలతో కలిసి పాల్గొన్న సీఎం
Advertisement
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో కలిసి భోగి సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. స్థానికులతో కలిసి భోగి మంటలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా కుటుంబం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 126 మంది మహిళలకు రూ.10,116 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. భోగి, సంక్రాంతి పండుగలు అందరికీ సకల శుభాలు తీసుకురావాలని చంద్రబాబు దంపతులు ఆకాంక్షించారు. స్వగ్రామంలో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రమే నారావారిపల్లెకు చేరుకున్నారు. నారా లోకేశ్ తో పాటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు సోమవారం నారావారిపల్లెకు చేరుకుంటారని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి.
Advertisement