భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

Advertisement
Update:2025-01-13 11:07 IST

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల ఫలితాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌ ఆరంభంలోనే 800 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11 గంటల సమయంలో 378.03 పాయింట్ల నష్టపోయి 77,000.39 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ఉదయం 180 పాయింట్లకు పైగా కోల్పోగా ప్రస్తుతం 154.1 పాయింట్ల నష్టంతో 23,277.40 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీ, టైటాస్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జొమాటో, ఎం అండ్‌ ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News