కులపిచ్చి వెయ్యి రెట్లైంది... కులపోళ్లను పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కాపు నేత ముద్రగడ పద్మనాభం ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు గతంలోనూ కులపిచ్చి ఉండేదని… కానీ ఇప్పుడది వెయ్యి రెట్లు పెరిగిపోయిందని ఆరోపించారు. కింది నుంచి పైవరకు కులపిచ్చే కనిపిస్తోందన్నారు. ఉద్యోగాలు, అధికారుల పోస్టింగ్‌ల్లో చూస్తే మొత్తం సొంతకులస్తులనే చంద్రబాబు నియమించుకున్నారని… పోస్టింగుల వివరాలు చూసినా ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఇక్కడి వారే కాకుండా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న కమ్మవాళ్లను కూడా తీసుకొచ్చి మరీ పదవులు ఇస్తున్నారని ముద్రగడ చెప్పారు. […]
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కాపు నేత ముద్రగడ పద్మనాభం ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు గతంలోనూ కులపిచ్చి ఉండేదని… కానీ ఇప్పుడది వెయ్యి రెట్లు పెరిగిపోయిందని ఆరోపించారు. కింది నుంచి పైవరకు కులపిచ్చే కనిపిస్తోందన్నారు. ఉద్యోగాలు, అధికారుల పోస్టింగ్‌ల్లో చూస్తే మొత్తం సొంతకులస్తులనే చంద్రబాబు నియమించుకున్నారని… పోస్టింగుల వివరాలు చూసినా ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఇక్కడి వారే కాకుండా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న కమ్మవాళ్లను కూడా తీసుకొచ్చి మరీ పదవులు ఇస్తున్నారని ముద్రగడ చెప్పారు. చంద్రబాబు తన కులంలో లక్షాధికారులను కోటీశ్వర్లుగానూ, కోటీశ్వర్లను పరమ కోటిశ్వర్లుగా మార్చే పనిలో ఉన్నారన్నారు. అలా సంపాదించిన సొమ్మును తిరిగి వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని ముద్రగడ చెప్పారు. అధికారంలో ఉన్నవారికి కులపిచ్చి లేకుంటే ఆ పిచ్చి మిగిలిన కులాలకు అంటదన్నారు. కానీ అధికారంలో ఉన్న వారికే కులపిచ్చి ఉంటే ఇతరకులాల్లోనూ అది పెరుగుతుందన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ ఆఫీసు ఖర్చులన్నీ భరించింది నారాయణేనని ముద్రగడ చెప్పారు. మొన్నటి ఎన్నికల్లోనూ టీడీపీ కోసం మంత్రి నారాయణ 200 కోట్లు ఖర్చు పెట్టారని అందుకే పరాయి కులస్తుడైనప్పటికీ ఒక్క నారాయణకు మాత్రం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.
విధ్వంసాలు సృష్టించడంలో చంద్రబాబును మించిన మహారాజు మరొకరు లేరన్నారు. 1984లో చంద్రబాబు, ఉపేంద్ర ఇద్దరూ ఎన్టీఆర్‌కు చెందిన స్డూడియోలో కూర్చుని బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టించారన్నారు. తాను చంద్రబాబును చాలా దగ్గరగా చూశానని… పరిటాల రవిని చంపేస్తారన్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసన్నారు. కానీ ఆయన్ను చంపేస్తే రాజకీయంగా వాడుకోవచ్చన్న ఉద్దేశంతోనే రవిని రక్షించేందుకు చంద్రబాబు ప్రయత్నించలేదన్నారు. చంద్రబాబు కులపిచ్చి లేనోడైతే తన సామాజికవర్గానికి చెందిన పరిటాల రవిపై పోలీసులు కేసులుపెడితే నేరుగా అనంతపురం వెళ్లి ధర్నాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరే టీడీపీనాయకుడి మీద కేసులు పెట్టలేదా అని ముద్రగడ ప్రశ్నించారు. జగన్ నుంచి సాయం తీసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. బాలకృష్ణ కాల్పులు జరిపినప్పుడు వైఎస్ వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకుని బతిమలాడుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. బాలకృష్ణ కాల్పులు కేసులో జగన్ తండ్రి గారి నుంచి సాయం పొందిన వ్యక్తి చంద్రబాబు అని ముద్రగడ చెప్పారు.
Click on Image to Read: