తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... కొట్టుకుపోయిన రైల్వే లైన్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం దెబ్బకు గుంటూరు జిల్లా గురజాలలో రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మాచర్లలోని గుండ్లకమ్మ వాగు, దాచేపల్లిలో నాగులేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొట్టుకుపోయిన రైల్వే పట్టాలను పునరుద్దరించేందుకు రైల్వే శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పైగా విజయవాడ రైల్వేస్టేషన్‌లో రూట్‌ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌ను […]

Advertisement
Update:2016-09-13 09:34 IST

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం దెబ్బకు గుంటూరు జిల్లా గురజాలలో రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మాచర్లలోని గుండ్లకమ్మ వాగు, దాచేపల్లిలో నాగులేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొట్టుకుపోయిన రైల్వే పట్టాలను పునరుద్దరించేందుకు రైల్వే శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పైగా విజయవాడ రైల్వేస్టేషన్‌లో రూట్‌ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌ను ఆధునీకరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈనెల 20 నుంచి 28 వరకు విజయవాడ లైన్‌లో రైళ్లను రద్దు చేశారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గంలోనూ పట్టాలు కొట్టుకుపోవడంతో రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News