ఏమి చతురత... ఏమి చతురత..!
పవన్ కల్యాణ్ ప్లెక్సిబుల్ పాలిటిక్స్ ముందు పాలిమర్ రబ్బర్ కూడా బలాదూర్. సీతాకోకచిలుక కంటే వేగంగా రూపాంతరం చెందుతున్న పవన్ కల్యాణ్ రాజకీయ నిర్ణయాలు మేధావులకు కూడా అంతుచిక్కడం లేదు. మూడంచెల్లో హోదాను సాధిస్తానని… ప్రతి జిల్లాలోనూ సభ ఏర్పాటు చేస్తానని తొలుత తిరుపతి సభలో పవన్ గర్జించి ప్రకటించారు. తిరుపతిలో పవన్ ఊపు చూసి పూర్తి స్థాయి రాజకీయం మొదలైందనుకున్నారు. కానీ ఇంతలోనే కాకినాడలో పవన్ మాట మార్చేశారు. ఆందోళనతో ఏమీ సాధించలేమని చెప్పుకొచ్చారు. సరే.. […]
పవన్ కల్యాణ్ ప్లెక్సిబుల్ పాలిటిక్స్ ముందు పాలిమర్ రబ్బర్ కూడా బలాదూర్. సీతాకోకచిలుక కంటే వేగంగా రూపాంతరం చెందుతున్న పవన్ కల్యాణ్ రాజకీయ నిర్ణయాలు మేధావులకు కూడా అంతుచిక్కడం లేదు. మూడంచెల్లో హోదాను సాధిస్తానని… ప్రతి జిల్లాలోనూ సభ ఏర్పాటు చేస్తానని తొలుత తిరుపతి సభలో పవన్ గర్జించి ప్రకటించారు. తిరుపతిలో పవన్ ఊపు చూసి పూర్తి స్థాయి రాజకీయం మొదలైందనుకున్నారు. కానీ ఇంతలోనే కాకినాడలో పవన్ మాట మార్చేశారు. ఆందోళనతో ఏమీ సాధించలేమని చెప్పుకొచ్చారు. సరే.. మరి తిరుపతిలో చెప్పినట్టు ప్రతిజిల్లాలో సభలు ఏర్పాటు సంగతేంటన్న దానిపై కాకినాడ సభా వేదికపై పవన్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ మరుసటి రోజు ఆ ముచ్చటపై అసలు ముచ్చట చెప్పారు పవన్.
కాకినాడ సభలో ఒక అభిమాని చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని కాబట్టి ఇకపై ఇలాంటి సభలు ఏర్పాటు చేయనని చెప్పారు. పైగా ప్రత్యేక హోదాపై పోరాటం చేయడం చేతకాదు అని ఇతర రాజకీయ పార్టీలన్నీ చేతులెత్తేస్తే అప్పుడు తాను రంగంలోకి దిగుతానన్నారు. అంటే ప్రతి జిల్లాలో సభ ద్వారా తరచు కనిపిస్తాడనుకున్న పవన్… అభిమాని మరణాన్ని కారణంగా చూపి సభలు రద్దు చేశారు. ఇక హోదాపై పోరాటం తమకు చేతకాదు అని విపక్షాలు ప్రకటించే అవకాశం కూడా లేదు. సో… హోదా కోసం పవన్ రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. అంటే పవన్ దర్శనం మళ్లీ ఎప్పుడో!. అభిమాని పేరు చెప్పి సభకు, విపక్షాల పోరాటానికి చాన్స్ ఇస్తున్నానంటూ హోదాపై పోరాటానికి పవన్ భలేగా నీళ్లొదిలేశారు. ఇలాంటి రాజకీయ చతురత చంద్రబాబు దగ్గరే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు పవన్ వద్ద కూడా కనిపించడం ఆసక్తికరమే.
Click on Image to Read: