ఆరని కావేరీ మంటలు

బెంగళూరు, చెన్నైలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కావేరి నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మొదలైన గొడవ హింసాత్మకంగా మారింది. బెంగళూరులో 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ప్యూ విధించారు. నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. తమిళనాడుకు చెందిన వాహనాలపై రాళ్ల దాడులు, దహనాల నేపథ్యంలో నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. కేంద్ర బలగాలను కూడా రప్పిస్తున్నారు. బెంగళూరులో సోమవారం ఒక్క రోజే 100 వాహనాలను దహనం చేశారు. తమిళనాడుకు చెందిన దుకాణాలపై రాళ్ల దాడులు జరిగాయి. […]

Advertisement
Update:2016-09-13 08:58 IST

బెంగళూరు, చెన్నైలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కావేరి నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మొదలైన గొడవ హింసాత్మకంగా మారింది. బెంగళూరులో 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ప్యూ విధించారు. నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. తమిళనాడుకు చెందిన వాహనాలపై రాళ్ల దాడులు, దహనాల నేపథ్యంలో నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. కేంద్ర బలగాలను కూడా రప్పిస్తున్నారు. బెంగళూరులో సోమవారం ఒక్క రోజే 100 వాహనాలను దహనం చేశారు. తమిళనాడుకు చెందిన దుకాణాలపై రాళ్ల దాడులు జరిగాయి. బెంగళూరులో పోలీస్‌ కాల్పులకు ఒక వ్యక్తి చనిపోయాడు. అటు కర్నాటకలో తమిళులపై దాడులకు నిరసనగా తమిళనాడులోనూ హింస చెలరేగింది. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు ఫోన్లలో సంప్రదింపులు జరుపుకుంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మోదీ కూడా స్పందించారు. హింసతో సాధించేది ఏమీ ఉండదని సంయమనం పాటించాలని కోరారు. కర్నాటక, తమిళనాడులో పరిస్థితులు బాధాకరమన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు హింసను వదిలిపెట్టి జాతీయ అవసరాల కోసం నిలబడతారని తాను నమ్ముతున్నట్లు మోదీ చెప్పారు. కావేరి వివాదంపై సదానందగౌడ మరోలా స్పందించారు. తమిళనాడే పరిస్థితులను రెచ్చగొడుతోందని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందుకే తమిళనాడుకు కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదన్నారు.

అటు తమిళనాడు, కర్నాటకలో గొడవలకు సంబంధించిన హింసాత్మక దృశ్యాలను ప్రసారం చేయవద్దని హైదరాబాద్‌ నగర పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు. కర్నాటక, తమిళనాడులోనూ తెలుగు ఛానళ్ల ప్రసారాలు జరుగుతున్నందున హింసాత్మక దృశ్యాలను ప్రసారం చేస్తే పరిస్థితులు మరింత అదుపు తప్పే ప్రమాదం ఉందని సూచించారు. కాబట్టి ఆయా దృశ్యాలను ప్రసారం చేయవద్దని నెట్వర్క్ ఆపరేటర్లకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఓ అడ్వయిజరీ నోట్ను పంపారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News