బతికున్న శిశువును చనిపోయిందన్న డాక్టర్లు, కామినేని ఆగ్రహం

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. బతికున్న శిశువును చనిపోయిందంటూ తల్లిదండ్రుల చేతిలో పెట్టారు. దీంతో తల్లిదండ్రులు బిడ్డను తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో కదలిక వచ్చింది.  వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకొచ్చారు. అయినా సరే వారు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. దీంతో బాధితులు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. విషయం పెద్దదయ్యే సరికి డాక్టర్లలో కదలిక వచ్చింది. వెంటనే ఆఘమేఘాల మీద శిశువును ఐసీయూలోకి తీసుకెళ్లారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. […]

Advertisement
Update:2016-09-13 09:16 IST

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. బతికున్న శిశువును చనిపోయిందంటూ తల్లిదండ్రుల చేతిలో పెట్టారు. దీంతో తల్లిదండ్రులు బిడ్డను తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో కదలిక వచ్చింది. వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకొచ్చారు. అయినా సరే వారు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. దీంతో బాధితులు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. విషయం పెద్దదయ్యే సరికి డాక్టర్లలో కదలిక వచ్చింది. వెంటనే ఆఘమేఘాల మీద శిశువును ఐసీయూలోకి తీసుకెళ్లారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డ చనిపోయిందని ధృవీకరించిన వైద్యులు ఎవరో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News