పొలిటికల్ ప్రేరేపిత నెగిటివ్ టాక్ కు ఎన్టీఆర్ విరుగుడు

చాలా మంది పెద్ద  హీరోల సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. వాటికి బెనిఫిట్ షోలు వేస్తుంటారు. కానీ బెనిఫిట్ షోల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది జూనియర్ ఎన్టీఆరే. ఒక రాజకీయ పార్టీ శ్రేణులు కక్ష కట్టి ఎన్టీఆర్‌ సినిమాలకు నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాయి. సదరు పార్టీ చేతిలో అనేక మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా సైట్లు కూడా ఉండడంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ చాలా నష్టపోతున్నారు. బెనిఫిట్‌ షోలో బొమ్మ పడటమే ఆలస్యం ఎన్టీఆర్‌ సినిమా బాగోలేదంటూ ప్రచారం చేస్తున్నారు. […]

Advertisement
Update:2016-09-13 01:31 IST

చాలా మంది పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. వాటికి బెనిఫిట్ షోలు వేస్తుంటారు. కానీ బెనిఫిట్ షోల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది జూనియర్ ఎన్టీఆరే. ఒక రాజకీయ పార్టీ శ్రేణులు కక్ష కట్టి ఎన్టీఆర్‌ సినిమాలకు నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నాయి. సదరు పార్టీ చేతిలో అనేక మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా సైట్లు కూడా ఉండడంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ చాలా నష్టపోతున్నారు. బెనిఫిట్‌ షోలో బొమ్మ పడటమే ఆలస్యం ఎన్టీఆర్‌ సినిమా బాగోలేదంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో షోలు పడకముందే సినిమా బాగున్నా సరే నెగిటివ్ పబ్లిసిటీ జరిగిపోతోంది. చివరకు భారీ హిట్ సొంతం చేసుకున్న నాన్నకు ప్రేమతో చిత్రానికి కూడా ఈ నెగిటివ్ టాక్ మొదట్లో తప్పలేదు. అయితే సినిమాలో దమ్ముండే సరికి ఎన్టీఆర్ వ్యతిరేకుల ఎత్తులు పారలేదు. తాజాగా జనతా గ్యారేజ్‌లోనూ అదే పని చేశారు. మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఊహించని నెగిటివ్ టాక్ వచ్చింది. బెనిఫిట్‌ షోలు చూసివచ్చి నెగిటివ్ రివ్యూలు రాసేశారు. కానీ అదృష్టవశాత్తు జనతా గ్యారేజ్ అవుటాఫ్ డేంజర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోల వల్ల జరుగుతున్న నష్టాన్ని ఎన్టీఆర్‌ గుర్తించారని చెబుతున్నారు. ఇకపై తన సినిమాలకు బెనిఫిట్ షోలు లేకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నారు. దీనిపై తన సన్నిహితుల వద్ద చర్చించారట. వారు కూడా ఎన్టీఆర్ ఆలోచనకు మద్దతు పలికారని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News