జనసేన ప్రకటన ఇక ఈ ఏడాదికి ఇంతేనా..?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో పనిలో నిమగ్రమయ్యారు. ఆయన ఇప్పుడు ఒక పుస్తకరం రాసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ పత్రిక ప్రకటనలో తెలిపింది. “నేను-మనం-జనం” పేరులో పవన్ పుస్తకం రాస్తున్నారట. “మార్పుకోసం యుద్ధం” అన్న ఒక ట్యాగ్‌లైన్ పుస్తకానికి పెడుతున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ పుస్తకం విడుదల చేస్తామని జనసేన ప్రకటించింది. జనసేన సిద్ధాంతాన్ని ఈ పుస్తకంలో వివరిస్తారట. జనసేన ఉద్దేశాలు, ఆలోచనలు పుస్తకంలో ఉంటాయి. ఇక్కడ మరో […]
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో పనిలో నిమగ్రమయ్యారు. ఆయన ఇప్పుడు ఒక పుస్తకరం రాసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ పత్రిక ప్రకటనలో తెలిపింది. “నేను-మనం-జనం” పేరులో పవన్ పుస్తకం రాస్తున్నారట. “మార్పుకోసం యుద్ధం” అన్న ఒక ట్యాగ్‌లైన్ పుస్తకానికి పెడుతున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ పుస్తకం విడుదల చేస్తామని జనసేన ప్రకటించింది. జనసేన సిద్ధాంతాన్ని ఈ పుస్తకంలో వివరిస్తారట. జనసేన ఉద్దేశాలు, ఆలోచనలు పుస్తకంలో ఉంటాయి. ఇక్కడ మరో ఆస్తకికరమైన అంశం ఏమిటంటే… జనసేనపై పవన్ మొన్నటి ఎన్నికల సమయంలోనే “ఇజం” పేరుతో బుక్ వేశారు. కానీ దాన్ని చదివిన వాళ్లు అర్థం చేసుకోలేక చిన్నపిల్లలు మధ్యలోనే చేతులు ఎత్తేశారు. వర్మలాంటి వారు కూడా “ఇజం”పై గట్టిగా సెటైర్లే వేశారు. దీంతో ఈసారి పుస్తకంలో సరళమైన భాష వాడుతారట. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ఏ విధంగా పోరాటం చేస్తారన్న దానిపైనా ప్రకట ఇచ్చి ఉంటే బాగుండేది. అది వదిలేసి పుస్తకం రాస్తున్నాం… వచ్చే ఏడాది విడుదల చేస్తామని ప్రకటన ఇవ్వడం బట్టి అంతవరకు పవన్ ఇక పుస్తక రచనలోనే ఉంటారని చెప్పదలుచుకున్నారా అన్న అనుమానం కలుగుతోంది.
అయినా పవన్ ఒక ఏడాది పాటు జనంలో విపరీతంగా తిరిగేసి … ప్రజల కష్టాలను తెలుసుకుని అప్పుడు సిద్ధాంత గ్రంథాలు రాసుకుంటే బాగుంటుంది. ఇలాంటి ప్రజాసంబంధ పుస్తకాలను అనుభవాలతో రాస్తే బాగుంటుంది. అయినా ప్రజలకోసం పోరాటం చేయాలనుకునే రాజకీయ పార్టీ ముందు జనం మధ్యలోకి రావాలి గానీ పుస్తకాలు రాసుకుని వాటితో ముందుకొస్తామంటే ఇదో కొత్త సిద్దాంతమే. ఇప్పటికే హోదాపై తాను ఇప్పట్లో పోరాటం చేయనని పవన్ చెప్పేశారు. కాకినాడ సభలో అభిమాని మృతి కారణంగా సభలు పెట్టబోనన్నారు. మరి కొత్త పుస్తకం మార్కెట్‌లోకి వచ్చే వరకు జనానికి పవన్ దర్శనం ఉండదా?. చూస్తుంటే ఇలాగే టైం పాస్ చేసి తీరా ఎన్నికల సమయంలో వచ్చి పొలికేకలు వేసే యోచనలో జనసేన పవన్ కల్యాణ్ ఉన్నట్టుగా ఉంది.
Click on Image to Read: