స్విస్ ఛాలెంజ్ పై కేసు వేసింది వైసీపీ ఎంపీ అభ్యర్ధా..?

మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజ్‌కు పబ్లిక్‌గా జైకొట్టారు. పోలవరం పనులు పరిశీలించిన చంద్రబాబు… పోలవరానికి 100 శాతం నిధులు ఇస్తున్నందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయమే తాను మోదీతో ఫోన్‌ మాట్లాడినట్టు చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించినందుకు కూడా ధన్యవాదాలు తెలిపానన్నారు. అయితే ప్రత్యేక హోదాకు సమానంగా రాయితీలు, నిధులు ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. పోలవరానికి వెంటనే కావాల్సినన్ని నిధులు ఇచ్చి ప్రాజెక్ట్ పూర్తికి సహకరించాల్సిందిగా కోరినట్టు వెల్లడించారు. జగన్‌ ఒక ఉన్మాదిలా తయారయ్యాడని ఫైర్ […]

Advertisement
Update:2016-09-13 13:32 IST

మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజ్‌కు పబ్లిక్‌గా జైకొట్టారు. పోలవరం పనులు పరిశీలించిన చంద్రబాబు… పోలవరానికి 100 శాతం నిధులు ఇస్తున్నందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయమే తాను మోదీతో ఫోన్‌ మాట్లాడినట్టు చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించినందుకు కూడా ధన్యవాదాలు తెలిపానన్నారు. అయితే ప్రత్యేక హోదాకు సమానంగా రాయితీలు, నిధులు ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. పోలవరానికి వెంటనే కావాల్సినన్ని నిధులు ఇచ్చి ప్రాజెక్ట్ పూర్తికి సహకరించాల్సిందిగా కోరినట్టు వెల్లడించారు.

జగన్‌ ఒక ఉన్మాదిలా తయారయ్యాడని ఫైర్ అయ్యారు. అందుకే కావాలని కేసులు వేయించి ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. స్విస్ ఛాలెంజ్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేసింది ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి అని చంద్రబాబు చెప్పారు. టెండర్ వేయకుండానే కోర్టుకు వెళ్లడం సరైనదేనా అని ప్రశ్నించారు. వైసీపీ, కాంగ్రెస్ నేతలకు ఎందుకింత దురద అన్నది తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే చంద్రబాబు ఆనందం వెనుక పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం రాష్ట్రానికి అప్పగించడమేనని చెబుతున్నారు. ఈనెల ఏడున పోలవరం బాధ్యతలను కేంద్రం బదలాయించింది. ఆ మరుసటి రోజే పోలవరం హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయం రూ. 1,481కోట్లు పెంచేశారు. ప్రస్తుతం పోలవరం పనులు చేస్తున్నది టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కంపెనీయే. ప్రాజెక్టును రాష్ట్రం చేతుల్లోకి తీసుకోవడం ద్వారా కావాల్సింత కుమ్మేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని కథనాలు వస్తున్నాయి. పోలవరం బదలాయింపు కారణంగానే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్‌ అంశంపై టీడీపీకి, కేంద్రానికి మధ్య చర్చల్లో ఆలస్యమైందని చెబుతున్నారు. పోలవరం అప్పగింతకు కేంద్రం ఓకే చేయగానే వెనువెంటనే ప్యాకేజ్‌కు చంద్రబాబు అంగీకారం తెలిపారన్నది సుస్పష్టం.

మరోవైపు పోలవరం పనులు పరిశీలించిన సీఎం అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో తిరుగు ప్రయాణం చేయలేదు. వాతావరణం సరిగా లేకపోవడంతో ఆయన హెలికాప్టర్ ఎక్కలేదు. రోడ్డు మార్గం ద్వారానే రాజమండ్రి వచ్చారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News