నాగం ఇదేం డిమాండ్‌!

క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయని ఇందుకు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశాడు నాగం జ‌నార్ద‌న్ రెడ్డి.  2008లో ఇచ్చిన విజిలెన్స్ నివేదికను, ఆ తర్వాత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) ఇచ్చిన నివేదికల్లోనూ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉందన్నారు. అందుకే, వెంట‌నే మంత్రి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి తీరాల‌ని అంటున్నాడు. నాగం డిమాండ్ విన‌డానికి వింత‌గా ఉంద‌ని టీఆర్ ఎస్ నేత‌ల‌తోపాటు, మీడియా ప్ర‌తినిధులు, […]

Advertisement
Update:2016-09-11 02:30 IST
క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయని ఇందుకు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశాడు నాగం జ‌నార్ద‌న్ రెడ్డి. 2008లో ఇచ్చిన విజిలెన్స్ నివేదికను, ఆ తర్వాత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) ఇచ్చిన నివేదికల్లోనూ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉందన్నారు. అందుకే, వెంట‌నే మంత్రి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి తీరాల‌ని అంటున్నాడు. నాగం డిమాండ్ విన‌డానికి వింత‌గా ఉంద‌ని టీఆర్ ఎస్ నేత‌ల‌తోపాటు, మీడియా ప్ర‌తినిధులు, రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. 2008లో అక్ర‌మాలు జ‌రిగితే.. జూప‌ల్లి ఎలా నైతిక బాధ్య‌త వ‌హిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 2004లో వైఎస్ కేబినెట్‌లో జూప‌ల్లి పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో క‌ల్వ‌కుర్తి ప్రాజెక్టులో జ‌రిగిన అక్ర‌మాల‌కు పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రి ఎలా బాధ్యుడ‌వుతాడు? 2009 త‌రువాత ఆయ‌న ఆయ‌న దేవాదాయ మంత్రిగా ప‌నిచేశారు. సాగునీటి ప్రాజెక్టుకు దేవాదాయ శాఖ‌కు ఎలా ముడిపెడ‌తారు? అని మండిపడ్డారు.
ఇప్ప‌టికే తెలంగాణ‌లో సాగునీటి ప్రాజెక్టుల్లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ.. రెండుసార్లు న్యాయ‌స్థానం గ‌డ‌పతొక్కి మొట్టికాయ‌లు వేయించుకున్న నాగం జనార్ద‌న్ రెడ్డి మ‌రోసారి వింత వాద‌న‌ను తెర‌పైకి తీసుకురావ‌డం విచిత్రంగా ఉంద‌ని అంటున్నారు. ఫ‌లితంగా మ‌రోసారి సాగునీటి విష‌యంలో కోర్టు గ‌డ‌ప తొక్కి న్యాయ‌స్థానం స‌మ‌యం వృథా చేయకండ‌ని కోర్టు మంద‌లించింది కూడా. రెండున్న‌రేళ్ల‌లో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం క‌ల్వ‌కుర్తి ప్రాజెక్టుపై రూ.245 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టింద‌ని నాగం ఆరోపిస్తున్నారు. రెండేళ్ల‌లో కేవ‌లం రూ.245 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చెపెట్టింద‌ని చెబుతున్న నాగం ఆ మొత్తంలో ఎంత అవినీతి జ‌రిగిందో.. సెల‌విస్తే మ‌రింత బాగుండేద‌ని అంటున్నారు గులాబీనేత‌లు. నాగంది వితంద వాద‌నో.. వింత వాద‌నో అర్థం కాక గులాబీ పార్టీ నేత‌లు, విలేక‌రులు బుర్ర గోక్కుంటున్నారు.
Tags:    
Advertisement

Similar News