అర్ధరాత్రి వెళ్లి వైఎస్‌ కాళ్లు పట్టుకున్నది మీరు... బాబును వెనుకేసుకురావద్దు పవన్

ప్రత్యేక హోదాను ఢిల్లీలో చంద్రబాబు అమ్మేశారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. హోదాను అమ్మేశారు కాబట్టే చంద్రబాబు మౌనంగా ఉన్నారన్నారు. పవన్‌ కల్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. హోదాను అమ్మేసిన చంద్రబాబును వెనుకేసుకువస్తే ప్రయోజనం ఉండదన్నారు. సీఎం మాటలకు పడిపోయి అమాయకంగా పవన్‌ నమ్మేస్తున్నారని అన్నారు. హోదా కోసం ప్రతిపక్షనాయకులు, పవన్‌లతో కలిసి దీక్ష చేసేందుకు చంద్రబాబు, లోకేష్‌ ముందుకురావాలన్నారు. తాను కూడా దీక్షలో కూర్చుకుంటానని చంద్రబాబు ఇంటి ఆవరణలోనే దీక్ష చేద్దామని సవాల్ […]

Advertisement
Update:2016-09-11 05:15 IST

ప్రత్యేక హోదాను ఢిల్లీలో చంద్రబాబు అమ్మేశారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. హోదాను అమ్మేశారు కాబట్టే చంద్రబాబు మౌనంగా ఉన్నారన్నారు. పవన్‌ కల్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. హోదాను అమ్మేసిన చంద్రబాబును వెనుకేసుకువస్తే ప్రయోజనం ఉండదన్నారు. సీఎం మాటలకు పడిపోయి అమాయకంగా పవన్‌ నమ్మేస్తున్నారని అన్నారు. హోదా కోసం ప్రతిపక్షనాయకులు, పవన్‌లతో కలిసి దీక్ష చేసేందుకు చంద్రబాబు, లోకేష్‌ ముందుకురావాలన్నారు. తాను కూడా దీక్షలో కూర్చుకుంటానని చంద్రబాబు ఇంటి ఆవరణలోనే దీక్ష చేద్దామని సవాల్ చేశారు. హోదాను ఢిల్లీలో, తెలుగు ప్రజల భూములను సింగపూర్‌లో అమ్మేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు ముద్రగడ.

పదేపదే తన వెనుక జగన్ ఉన్నారని టీడీపీ ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. వైఎస్‌ వద్ద సాయం పొందింది తాను కాదని చంద్రబాబే అర్ధరాత్రి వెళ్లి వైఎస్ కాళ్లు పట్టుకున్నారని ముద్రగడ చెప్పారు. బాలకృష్ణ కాల్పులు జరిపినప్పుడు చంద్రబాబు అర్థరాత్రి వేరే కారులో రహస్యంగా వెళ్లి రక్షించాల్సిందిగా కాళ్లు పట్టుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన సీటు కోసం కాపులను గ్రూపులుగా విభజిస్తున్నారని ఆరోపించారు.రంగా హత్య సమయంలో టెర్రిరిస్ట్‌ చట్టాన్ని కాపులపై పెట్టించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. కాపులను కాపులతో తిట్టించడం మానుకోవాలన్నారు. చంద్రబాబుకు ధైర్యముంటే తునిలాంటి సభ పెట్టి తనను తిట్టించాలని సవాల్ చేశారు. తన ఇంటి మీద కెమెరాలు పెడుతామని ప్రభుత్వం అంటోందని… కావాలంటే తన ఒంటిమీదే సీసీ కెమెరా అమర్చి ఎప్పటికప్పుడు చంద్రబాబు చూసుకోవచ్చని ముద్రగడ అన్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News