వైసీపీ బంద్‌పై "ఆపరేషన్ ముద్రగడ" ఫార్ములా
ముద్రగడ దీక్ష గుర్తుందా!. ఆయన 11 రోజులు దీక్ష చేస్తే ఆయనకు సంబంధించిన ఒక్క వార్త కూడా ఏ టీవీ ఛానల్‌లోనూ ప్రసారం రాలేదు. ఇదంతా బాబు ఆదేశంతోనే ఆయన అనుకూల మీడియా చేసిందన్నది జగమెరిగిన సత్యం. ఎందుకంటే బలమైన సామాజికవర్గానికి చెందిన ముద్రగడ దీక్ష వార్తలను ఏ ఛానల్ కూడా సొంతంగా నిషేధించుకోదు. చంద్రబాబే సమర్థవంతంగా తన అనుకూల మీడియా సాయంతో ముద్రగడ నోరునొక్కేశారు. బహుశా మీడియా మొత్తం ఒక వ్యక్తి దీక్ష విషయంలో మూగబోయిన సన్నివేశం […]
ముద్రగడ దీక్ష గుర్తుందా!. ఆయన 11 రోజులు దీక్ష చేస్తే ఆయనకు సంబంధించిన ఒక్క వార్త కూడా ఏ టీవీ ఛానల్‌లోనూ ప్రసారం రాలేదు. ఇదంతా బాబు ఆదేశంతోనే ఆయన అనుకూల మీడియా చేసిందన్నది జగమెరిగిన సత్యం. ఎందుకంటే బలమైన సామాజికవర్గానికి చెందిన ముద్రగడ దీక్ష వార్తలను ఏ ఛానల్ కూడా సొంతంగా నిషేధించుకోదు. చంద్రబాబే సమర్థవంతంగా తన అనుకూల మీడియా సాయంతో ముద్రగడ నోరునొక్కేశారు. బహుశా మీడియా మొత్తం ఒక వ్యక్తి దీక్ష విషయంలో మూగబోయిన సన్నివేశం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేదు.
ఇప్పుడు ప్రత్యేక హోదాపై వైసీపీ, వామపక్షాలు ఇచ్చిన బంద్ విషయంలోనూ దాదాపు అదే ఎత్తు ప్రయోగించారు. ఈసారి చంద్రబాబు స్వయంగా ఆదేశాలు ఇచ్చారో లేక బాబు అనుకూల టీవీ ఛానళ్లన్నీ సొంతంగా నిర్ణయం తీసుకున్నాయో గానీ బంద్ దృశ్యాలను ప్రసారం చేసిన తీరు గమనిస్తే కొన్ని అనుమానాలు రాకమానవు. టీడీపీకి వంతపాడే ముఖ్యమైన ఛానళ్లలో ఉదయం నుంచి ప్రసారం అయిన విజువల్స్‌ను గమనిస్తే వైసీపీ శ్రేణుల ఆందోళన విజువల్స్ చాలాచాలా నామమాత్రమే. అవి కూడా మరీ పూర్తిగా చూపించకపోతే జనానికి అనుమానం వస్తుందేమోనన్న ఆలోచనతోనే చూపించినట్టుగా ఉన్నాయి. అయితే ఇక్కడ బాబు చానళ్లు తెలివిగా ఒక ఎత్తును ప్రయోగించాయి. బంద్‌ను వైసీపీ, వామపక్షాలు కలిసి చేస్తుండడాన్ని అవకాశంగా తీసుకున్నారు. బాబుకు బాకా ఊదే చానళ్లు అన్నీ వైసీపీ శ్రేణుల ఆందోళన విజుల్స్ నామమాత్రంగా చూపిస్తూ… వామపక్షాలకు మాత్రం భలే కవరేజ్ ఇచ్చాయి. ఎవరైనా కొత్త వాళ్లు చూస్తే కమ్యూనిస్టులు మాత్రమే బంద్ చేస్తున్నారు అన్న భ్రమ కలిగించింది ఎల్లో మీడియా.
ఇలా చేయడం ద్వారా వైసీపీ కంటే వామపక్షాలే బంద్‌లో ఉధృతంగా పాల్గొన్నాయన్న ఫీలింగ్ కలిగించేందుకు ప్రయత్నించారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… దృశ్యాల్లో వైసీపీ శ్రేణులను ఎక్కడా చూపించకపోయినా స్కోలింగ్‌లో మాత్రం వైసీపీ నేతల అరెస్ట్‌లు, హౌజ్ అరెస్ట్ వార్తలను మాత్రం ప్రసారం చేశారు. కానీ వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్న దృశ్యాలు మాత్రం జనం కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. బంద్ సందర్బంగా పచ్చ మీడియా చానళ్లు వేసిన విన్యాసాలు చూస్తుంటే… త్వరలోనే చంద్రబాబుకు ఏపీలో ప్రత్యామ్నాయం వామపక్షాలు, పవన్ కల్యాణే అని కూడా నమ్మించేలా ఉన్నారు. అయినా అనంతపురం జిల్లాలో కేవలం రెండు రోజుల్లోనే లక్షల ఎకరాల వేరుశనగ పంటకు ట్యాంకర్లతో నీరు తీసుకొచ్చి పంటను రక్షించి.. కరువును కర్నాటక వైపు తరిమేసిన ఘనత తమ చంద్రబాబుదే అని ప్రచారం చేస్తున్న పచ్చ మీడియాకు ఇలాంటి చిన్నచిన్న కుప్పిగంతులు ఒక లెక్కనా?.
Click on Image to Read: