లాబీల్లో జగన్ చిట్ చాట్..
అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా ప్రతినిధులతో జగన్ చిట్‌చాట్ చేశారు. హోదా విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నట్టుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు స్వార్థం వల్లే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందన్నారు. ఓటుకు నోటు కేసుకోసం 5కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టడం సరికాదన్నారు. టీడీపీ మంత్రిని పక్కలో కూర్చోబెట్టుకుని జైట్లీ ప్రకటన చేశారని… […]
అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా ప్రతినిధులతో జగన్ చిట్‌చాట్ చేశారు. హోదా విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నట్టుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు స్వార్థం వల్లే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందన్నారు. ఓటుకు నోటు కేసుకోసం 5కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టడం సరికాదన్నారు. టీడీపీ మంత్రిని పక్కలో కూర్చోబెట్టుకుని జైట్లీ ప్రకటన చేశారని… గతంలో రక్తం మరిగిందన్న చంద్రబాబు ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మరిగిన రక్తం మురిగిపోయిందా అని జగన్ ఎద్దేవా చేశారు. ఇలాంటి సీఎం ఉండడం తెలుగు ప్రజల దురదృష్టమన్నారు. చరిత్రహీనుడిగా చంద్రబాబు మిగిలిపోతారన్నారు. హోదా కోసం వైసీపీ మాత్రం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు జగన్.
Click on Image to Read: