అప్పట్లో కోట్ల, ఇప్పుడు పీవీ... వాడేసిన చంద్రబాబు
సత్యనాదెళ్ల, సింధు, గోపిచంద్, అబ్దుల్ కలాం, వాజ్‌పేయి, దేవగౌడ, ఐకే గుజ్రాల్ జీవితాలను మార్చింది తానేనని పదేపదే చెప్పే చంద్రబాబు… ఇప్పుడు పీవీ నరసింహారావును వాడుకున్నారు. అయితే చంద్రబాబు చెప్పింది వాస్తవానికి దూరంగా ఉంది. శాసనమండలిలో ప్రత్యేకహోదాపై ప్రకటన చేస్తున్న సమయంలో చంద్రబాబు హైదరాబాద్ గురించి ప్రస్తావించారు. ”నేనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా. అది నేను వేసిన విత్తనమే. ఇప్పుడు పెద్దదైంది. అప్పట్లో ప్రధాని పివీ నరసింహారావు విదేశాలకు వెళ్లారు. అక్కడి నగరాలను చూసి మీవే కాదు ఒకసారి మా హైదరాబాద్ […]
సత్యనాదెళ్ల, సింధు, గోపిచంద్, అబ్దుల్ కలాం, వాజ్‌పేయి, దేవగౌడ, ఐకే గుజ్రాల్ జీవితాలను మార్చింది తానేనని పదేపదే చెప్పే చంద్రబాబు… ఇప్పుడు పీవీ నరసింహారావును వాడుకున్నారు. అయితే చంద్రబాబు చెప్పింది వాస్తవానికి దూరంగా ఉంది. శాసనమండలిలో ప్రత్యేకహోదాపై ప్రకటన చేస్తున్న సమయంలో చంద్రబాబు హైదరాబాద్ గురించి ప్రస్తావించారు. ”నేనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా. అది నేను వేసిన విత్తనమే. ఇప్పుడు పెద్దదైంది. అప్పట్లో ప్రధాని పివీ నరసింహారావు విదేశాలకు వెళ్లారు. అక్కడి నగరాలను చూసి మీవే కాదు ఒకసారి మా హైదరాబాద్ వచ్చి చూడండి. అద్బుతంగా ఉందని విదేశాల్లో చెప్పారు. అలాంటి సిటీని వదిలేసి వచ్చాం. రాజధానికి గుంటూరు, విజయవాడ మధ్య ప్రదేశమే సరైనది” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే… చంద్రబాబు సీఎం అయిందే 1995 సెప్టెంబర్ ఒకటిన. పీవీ నరసింహారావు 1996లో దిగిపోయారు. చంద్రబాబు సీఎం అయిన ఎనిమిది నెలలకే పీవీ ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. అంటే సీఎం పగ్గాలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే హైదరాబాద్‌ను చంద్రబాబు విదేశాల్లో చెప్పుకునే స్థాయికి అభివృద్ది చేశారన్న మాట. వినడానికే విచిత్రంగా ఉంది కదు!. ఎనిమిది నెలల్లోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం సాధ్యమా?. ఆ విషయాన్ని పీవీ నరసింహారావు విదేశాల్లో చెప్పారా?. ఎంటో చంద్రబాబు చరిత్రను కూడా తారుమారు చేసి మాట్లాడేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబుపై ఇలాంటి విమర్శే ఒకటి ఉంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి వెంటిలేటర్‌పై ఉండగా ఆయన్ను పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లారు. బయటకు వచ్చి తన పాలనను కోట్ల విజయభాస్కర్ రెడ్డి మెచ్చుకున్నారని చంద్రబాబు చెప్పుకున్నాడు. కాంగ్రెస్ నేతలు దానిని ఖండిచినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు పీవీని వాడుకున్నారు. బాబుగారి వాడకం అలాగే ఉంటుంది మరీ!.
Click on Image to Read: