కదిలే రైలులోంచి దిగి కూతుర్ని పోగొట్టుకుంది

ప్రొఫెసర్‌ సుందరవేలన్‌, అతని భార్య లక్ష్మి బంధువుల పెళ్లికి కుంభకోణం వెళ్లారు. మన్నాయ్‌ ఎక్స్‌ప్రెస్‌లో తిరిగివస్తున్నారు. చెన్న్తె ఎగ్మోర్‌ స్టేషన్‌లో దిగాల్సివుంది. అయితే సిగ్నల్‌ పడకపోవడంతో అనుకోనివిధంగా ఆ రైలు మాంబళం రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఇక్కడే దిగేస్తే మీ ఇంటికి వెళ్లడం దగ్గర అని చుట్టుప్రక్కల ప్రయాణికులు చెప్పడంతో ప్రొఫెసర్‌ సుందరవేలన్ అక్కడ దిగేద్దామని భార్యతో చెప్పాడు. హడావుడిగా సామాన్లను తీసుకొని సుందరవేలన్‌ మెట్లదగ్గరకు వచ్చాడు. అప్పటికే రైలు బయలుదేరింది. తక్కువ వేగంతో వెళుతుండడంతో సుందరవేలన్‌ సామానుతో […]

Advertisement
Update:2016-09-07 11:30 IST

ప్రొఫెసర్‌ సుందరవేలన్‌, అతని భార్య లక్ష్మి బంధువుల పెళ్లికి కుంభకోణం వెళ్లారు. మన్నాయ్‌ ఎక్స్‌ప్రెస్‌లో తిరిగివస్తున్నారు. చెన్న్తె ఎగ్మోర్‌ స్టేషన్‌లో దిగాల్సివుంది. అయితే సిగ్నల్‌ పడకపోవడంతో అనుకోనివిధంగా ఆ రైలు మాంబళం రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఇక్కడే దిగేస్తే మీ ఇంటికి వెళ్లడం దగ్గర అని చుట్టుప్రక్కల ప్రయాణికులు చెప్పడంతో ప్రొఫెసర్‌ సుందరవేలన్ అక్కడ దిగేద్దామని భార్యతో చెప్పాడు. హడావుడిగా సామాన్లను తీసుకొని సుందరవేలన్‌ మెట్లదగ్గరకు వచ్చాడు. అప్పటికే రైలు బయలుదేరింది. తక్కువ వేగంతో వెళుతుండడంతో సుందరవేలన్‌ సామానుతో సహా దిగేశాడు.

ఆయన భార్య లక్ష్మి చేతుల్లో 18 నెలల కూతురుతో రైలు దిగబోయింది. అప్పటికే రైలు వేగం అందుకుంది. కానీ భర్త దిగేసి వుండడంతో దైర్యం చేసి దూకేసింది. పొరపాటున కాలు జారి పడిపోయింది. ఆమె చేతుల్లో ఉన్న బిడ్డ ఫ్లాట్‌ ఫారమ్‌కు, రైలుకు మధ్యలో పడి నలిగి అక్కడికక్కడే చనిపోయింది. లక్ష్మికి మాత్రం కాలు విరిగింది. పాపం కొద్ది కిలోమీటర్ల ప్రయాణం తగ్గించుకుందామని ప్రయత్నించిన ఆ దంపతులు బిడ్డను కోల్పోయారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News