ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబే... క్లారిటీ ఇచ్చిన జైట్లీ

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఇక లేనట్టే. కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా ఏపీకి ప్యాకేజ్‌ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం నుంచి ఢిల్లీలో నడుస్తున్న హైడ్రామా నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసేందుకు వచ్చిన జైట్లీ… మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నట్టు ప్రకటించారు. హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజ్‌లో ఉండేలా చూస్తామన్నారు. ప్యాకేజ్‌పై వీలైనంత త్వరగానే ప్రకటన చేస్తామన్నారు. ప్రకటన ఈ రోజు చేయాలా లేదా అన్న దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదని చెప్పారు. […]

Advertisement
Update:2016-09-07 12:03 IST

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఇక లేనట్టే. కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా ఏపీకి ప్యాకేజ్‌ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం నుంచి ఢిల్లీలో నడుస్తున్న హైడ్రామా నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసేందుకు వచ్చిన జైట్లీ… మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నట్టు ప్రకటించారు. హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజ్‌లో ఉండేలా చూస్తామన్నారు. ప్యాకేజ్‌పై వీలైనంత త్వరగానే ప్రకటన చేస్తామన్నారు. ప్రకటన ఈ రోజు చేయాలా లేదా అన్న దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదని చెప్పారు.

ఏపీకి ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోమన్నారు. హోదా లేని రాష్ట్రాలు భరించే 30 శాతం నిధులను కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సో… ఏపీకి ప్యాకేజే గతి అని తేలిపోయింది. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారన్న దానిపై అందరి దృష్టి ఉంది. ప్యాకేజ్‌ ఇస్తారని చంద్రబాబుకు వారం క్రితమే క్లారిటీ ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా దాగుడుమూతలు ఆపి చంద్రబాబు హోదా కోసమే పట్టుబడుతారో లేదో చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News