సిద్ధిపేటకు రా.. ఉత్తమ్ కు హరీష్ సవాల్!
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లపై ఈయన విరుచుకుపడ్డారు. మెదక్ ను మూడు జిల్లాలుగా విభజించాల్సిన అవసరమేంటని ఉత్తమ్ ప్రశ్నించడం అర్థరహితమన్నారు. స్థానిక పరిస్థితులపై అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. ఇదే మాటను మా సిద్ధపేటకు వచ్చి అని చూడాలని సవాలు విసిరారు. ఈ మాటలు సిద్ధిపేట మాట్లాడితే.. ప్రజలే సమాధానం […]
Advertisement
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లపై ఈయన విరుచుకుపడ్డారు. మెదక్ ను మూడు జిల్లాలుగా విభజించాల్సిన అవసరమేంటని ఉత్తమ్ ప్రశ్నించడం అర్థరహితమన్నారు. స్థానిక పరిస్థితులపై అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. ఇదే మాటను మా సిద్ధపేటకు వచ్చి అని చూడాలని సవాలు విసిరారు. ఈ మాటలు సిద్ధిపేట మాట్లాడితే.. ప్రజలే సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోంటే ఓర్వలేకే ఇలాంటి చవకబారు ఆరోపణలను దిగుతున్నారని దుయ్యబట్టారు. సిద్ధిపేటను జిల్లాను చేయాలన్న డిమాండ్ ఇప్పటిది కాదన్నారు. కొన్ని దశాబ్దాలుగా సిద్ధిపేటను జిల్లాను చేయాలని ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నపుడు కూడా ప్రజలు పార్టీలకతీతంగా ప్రత్యేక జిల్లా కోసం ఉద్యమాలు చేసిన సంగతి మీకు తెలియదా? అని మండిపడ్డారు. ఇప్పుడు సిద్ధిపేటను జిల్లాగా చేయాల్సిన అవసరమేంటని ఉత్తమ్ కుమార్ ప్రశ్నించడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని చురకలంటించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందంటే.. ఓర్వలేక కుళ్లుతో ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.
Advertisement