తన్నండి.. కానీ మెత్తగా: వీహెచ్‌పీ సలహా
తంతే ఎముకలు విరుగుతాయి.. పళ్లు రాలుతాయ్! అసలు తన్నమని ఉసిగొల్పడమే నేరం.. అందులో కాస్త చూసి మెత్తగా తన్నండని చెప్పడమేంటి? ఇదేం దిక్కుమాలిన సలహా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ వివాదాస్పద ప్రకటన చేసింది ఇంకెవరో కాదు విశ్వహిందూ పరిషత్ సంస్థ. తమ యువ గో సంరక్షకులకు ఈ మేరకు ఉచిత సలహాను ఇచ్చింది. ఆవులను అక్రమంగా తరలించేవారిని, దొంగిలించే వారిని పట్టుకుని తన్నండి..కానీ వారి ఎముకలు విరగ్గొట్టకుండా తన్నండని ఉచిత సలహా ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని బ్రజ్, […]
Advertisement
తంతే ఎముకలు విరుగుతాయి.. పళ్లు రాలుతాయ్! అసలు తన్నమని ఉసిగొల్పడమే నేరం.. అందులో కాస్త చూసి మెత్తగా తన్నండని చెప్పడమేంటి? ఇదేం దిక్కుమాలిన సలహా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ వివాదాస్పద ప్రకటన చేసింది ఇంకెవరో కాదు విశ్వహిందూ పరిషత్ సంస్థ. తమ యువ గో సంరక్షకులకు ఈ మేరకు ఉచిత సలహాను ఇచ్చింది. ఆవులను అక్రమంగా తరలించేవారిని, దొంగిలించే వారిని పట్టుకుని తన్నండి..కానీ వారి ఎముకలు విరగ్గొట్టకుండా తన్నండని ఉచిత సలహా ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని బ్రజ్, ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన గో సంరక్షక బృందం ఉన్నత ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గో సంరక్షక శాఖ కేంద్ర కమిటీ సభ్యుడు ఖేమ్ చంద్ పలు వివాదాస్పద అంశాలపై ప్రసంగించారు. గోవులను తరలించేవారిని తన్నండి.. కానీ వారి ఎముకలు విరగకుండా జాగ్రత్త తీసుకొంది. ఇలా తంతూ పోతే.. మిగిలిన వారిలో భయం ఏర్పడి.. ఆవుల అక్రమరవాణకు జంకుతారు. ఇటీవల నకిలో గో సంరక్షకులపై మోదీ చేసిన వ్యాఖ్యలపై నేను ఏకీభవించను. కానీ, ఒకే ఒక్క అంశాన్ని అంగీకరిస్తాను. అదే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి. ఇప్పడంటే మేకిన్ ఇండియాలాంటి ప్రోగ్రాముల వల్ల పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. మరి ఒకప్పుడు ఆవే కదా. దేశానికి అన్నం పెట్టిందన్న సంగతిని మరవకండని స్పష్టం చేశారు. అందుకే, అలాంటి ఆవుల్ని అక్రమంగా రవాణా చేసేవారిని ఎముకలు విరక్కుండా తన్నండని పిలుపునిచ్చారు.
Advertisement