రామలింగరాజుకూ ఎగనామం పెట్టబోయారా?

అప్పటి వరకు ఐటీ రంగంలో కింగ్‌లా కనిపించిన రామలింగరాజు… సత్యం స్కాం తర్వాత ఊహించని పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆయనతో పరిచయం కోసం తపించిన వారు స్కాం బయటపడ్డాక తమకు రామలింగరాజుతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు. సత్యం స్కాం బయటపడ్డాక అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. రామలింగరాజుతో మీకు సంబంధాలున్నాయంటే మీకు సంబంధాలున్నాయంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అవన్నీ పక్కన పెడితే రామలింగరాజుతో పరిచయమే కాదు ఆర్థికసంబంధాలు […]

Advertisement
Update:2016-09-04 03:06 IST

అప్పటి వరకు ఐటీ రంగంలో కింగ్‌లా కనిపించిన రామలింగరాజు… సత్యం స్కాం తర్వాత ఊహించని పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆయనతో పరిచయం కోసం తపించిన వారు స్కాం బయటపడ్డాక తమకు రామలింగరాజుతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు. సత్యం స్కాం బయటపడ్డాక అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. రామలింగరాజుతో మీకు సంబంధాలున్నాయంటే మీకు సంబంధాలున్నాయంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అవన్నీ పక్కన పెడితే రామలింగరాజుతో పరిచయమే కాదు ఆర్థికసంబంధాలు కూడా టీడీపీ కేంద్రమంత్రి సుజనాచౌదరితో ఉన్నట్టు తేలింది.

సత్యం ఊపులో ఉన్నప్పుడు సుజనా చౌదరి అప్పుగా డబ్బు తీసుకున్నారు. అయితే స్కాం బయటపడడంతో దాన్ని ఎగ్గొట్టేందుకు ప్రయత్నించారు. కానీ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మాత్రం ఆ డబ్బు తిరిగి చెల్లించాలని సుజనాచౌదరికి, ఆయన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. 1999లో రామలింగరాజు నుంచి సుజనాచౌదరి రూ. 6.20 కోట్లు అప్పుతీసుకున్నారు. 17 ఏళ్ల క్రితం రూ. 6.20 కోట్లు అంటే పెద్ద మొత్తమే. కానీ అప్పు తీర్చడం అంటే పెద్దగా నచ్చని సుజనా తిరిగి సొమ్ము చెల్లించలేదు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు తీసుకున్న డబ్బుపై తొలి ఆరు నెలలు 18శాతం, ఆ తర్వాత 24 శాతం వడ్డీతో డబ్బు చెల్లించాలని ఆదేశించింది. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ విదేశీ చదువులకు కూడా రామలింగరాజే డబ్బు ఖర్చు పెట్టారని చెబుతుంటారు. అలాంటి వ్యక్తికి టీడీపీ నేత సుజనా చౌదరి డబ్బు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యమే.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News